Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 26 బుధవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   26 Sep 2018 1:38 AM GMT
సెప్టెంబర్ 26 బుధవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: ఖర్చులు అధికమవుతాయి. లక్ష్యసాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పందాలు - పోటీలు - అంచనాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగాలు. విదేశీయానం - రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ - పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఈ రోజు ధనం బాగా ఖర్చు చేస్తారు.

వృషభరాశి: సహోద్యోగులకు సంబంధించిన రహస్య సమాచారం అందుకుంటారు. డైటింగ్, యోగధ్యానాలపై దృష్టి పెడతారు. గత అనుభవంతో వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పనులు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఆదాయాభివృద్ధి - మానసిక ప్రశాంతత - సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు. పనులు సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రమోషన్స్ పొందుతారు.

మిథునరాశి: ప్రతిఫలం అందుకుంటారు. స్నేహ - సంబంధాలు వికసిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వ్యవహారా ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. దూరప్రయాణాలతో కలిసి వస్తుంది.

కర్కాటకరాశి: పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు - బదిలీలు - మార్పులకు అనుకూల సమయం. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలు - రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు సాహస ప్రయత్నాలు విరమించండి. వృత్తి - ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడినా సత్ఫలితాలుంటాయి.

సింహరాశి: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చర్చల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కళలు, సాహిత్యం, ప్రణాళికలు టూరిజం రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. ప్రణాళిక బద్దంగా వ్యవహరించి సాధిస్తారు. ఆదాయ - వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులకు పరిచయాలు - నూతన వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభిస్తాయి. బీమా - గ్రాట్యూటీ - పెన్షన్ వ్యవహారాలకు అనుకూలం. గృహనిర్మాణ పనులు ప్రారంభంలో మందగించినా క్రమేణా వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. దూరప్రయాణం తలపెడతారు. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.

తులరాశి: బ్యాంకులు - న్యాయ - వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు. అంచనాలు లాభిస్తాయి. దుబారా ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు - విశ్రాంతి లోపం.. ఉద్యోగ - విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.

వృశ్చికరాశి: వృత్తి - వ్యాపార విషయాలను సమీక్షించుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. సహోద్యోగుల అంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. ఇంజనీరింగ్ - శాస్త్ర - సాంకేతిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మార్పులు - చేర్పులు - మరమ్మతులకు అనుకూలం.

ధనస్సురాశి: విద్య - క్రీడలు - బ్యాంకుల రంగాల వారికి ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. ఖర్చులు అధికం. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు - పొదుపు పథకాలు లాభిస్తాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు - దూరప్రయాణాల్లో మెళకువ వహించండి.

మకరరాశి: చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఊరటనిస్తాయి. బదిలీలు - మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు - స్థలం మార్పు విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఊరటనిస్తాయి. కోళ్ల - మత్స్య - గొర్రెల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆర్థిక విషయాల్లో తొందర వద్దు. కూరగాయలు - కొబ్బరి - పండ్దు వ్యాపారులకు కలిసి వస్తుంది.

కుంభరాశి: విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. కీలక సందేశాలు అందుకుంటారు. స్టేషనరీ - రవాణా - ఏజెన్సీ - రక్షణ న్యాయ - బోధన - పర్యాటక రంగాల వారికి శుభప్రదం. వాహన సౌకర్యం కలుగుతుంది. ప్రతిభకు నిదానంగా గుర్తింపు. సంతానంతో ఓర్పు - నేర్పు చాలా అవసరం.

మీనరాశి: ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. షాపింగ్ - క్రయవిక్రయాలకు అనుకూలం. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. కృషికి కుటుంబ సభ్యుల తోడ్పాటునందుతుంది. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురినిస్తాయి. వ్యవహారాలతో సంతృప్తి కనబడదు.