Begin typing your search above and press return to search.

అక్టోబర్ 12 శుక్రవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   12 Oct 2018 1:50 AM GMT
అక్టోబర్ 12 శుక్రవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: భాగస్వామి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. బీమా - గ్రాట్యూటీ - పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. గృహమరమ్మతులు వాయిదా పడతాయి. రుణప్రయత్నాల్లో ఆటంకాలు. పరిచయాలు మరింతగా బలపడుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభరాశి: భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందుల్లో పరిమితి పాటించాలి. కొత్త అనుబంధాలు ఏర్పడుతాయి. సంకల్పం నెరవేరుతుంది. స్నేహాలు బలపడతాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు - బిల్డర్లకు ఒత్తిడి - శ్రమాధిక్యత ఎదుర్కోవాల్సి వస్తుంది. కొబ్బరి - పండ్లు - పూలు - చిరు వ్యాపారులకు లాభదాయకం. వైద్యులకు మెళకువ అవసరం.

మిథునరాశి: ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సహోద్యోగులతో విందు - వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి - వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రకటనలు - సృజనాత్మక రంగాల వారికి అనుకూలం. కార్యసాధనలో ఓర్పు - పట్టుదల అవసరం. ఉద్యోగులకు అధికారు లనుంచి మంచి గుర్తింపు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారులకు కావలసిన పెట్టబడులు వాయిదా పడుతాయి.

కర్కాటకరాశి: ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు పథకాలు - చిట్ ఫండ్ లకు అనుకూలం. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. చిన్నారులు - ప్రియమైన వారి కలయిక ఆనందం కలిగిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. మీ ఉన్నతి చూసి అసూయ పడేవారు ఎక్కువవుతారు. స్త్రీల ఏమరుపాటుతో తీవ్ర నష్టం.

సింహరాశి: విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారంతో ఆవేదన కలుగుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. బదిలీలు - మార్పులకు అనుకూలం.రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. లాయర్లకు చికాకులు. స్త్రీలకు చుట్టుపక్కలవారితో విభేదాలు. పనులకు ఆటంకాలైనా పూర్తి చేస్తారు.

కన్యరాశి: బోధన - రవాణా - స్టేషనరీ - కమ్యూనికేషన్ల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సోదరీ - సోదరుల సహకారంతో ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు. రుణాలు - పెట్టుబడుల కోసం ప్రయత్నాలు. అనుకున్న పనుల్లో ఏకాగ్రత లోపంతో చికాకులు.

తులరాశి: విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత గమనించాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్ - తినుబంధారాల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలు ఇష్టమైన రంగాల్లో రాణిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.

వృశ్చికరాశి: కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి తొందర తగదు. సినీ - రాజకీయ రంగాల వారికి అనుకూలం. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్తబ్దత తొలిగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. వైద్యులకు ఏకాగ్రత అవసరం. అధికారులకు పర్యటనలు - తనిఖీలు అధికం. అంచనాలున్న రంగాల్లోని వారికి పరిస్థితి తారుమారు. ఓర్పు - శ్రమాధిక్యతతో కార్యాలు పూర్తి చేస్తారు.

ధనుస్సురాశి: సినీ - రాజకీయ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆడిటింగ్ - బ్యాంకింగ్ - రంగాల వారికి ప్రోత్సాహకరం. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈరోజు కళ - క్రీడ - శాస్త్ర రంగాల వారికి గుర్తింపు - ప్రోత్సాహం. కొబ్బరి - పండ్ల - పూల వ్యాపారులకు లాభదాయకం. సొంత వ్యాపారాలపై ఆలోచన..

మకరరాశి: సంకల్ప సిద్దికి శ్రమించాలి. వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. బృంద కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు సిద్ధమవుతాయి. నూనె - మిర్చి - మినుము వ్యాపారస్థులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఒక సమాచారం అందుతుంది.

కుంభరాశి: వృత్తి - వ్యాపారాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెద్దలతో సమావేశాల్లో కొంత అసౌకర్యం. రక్షణ - న్యాయ - బోధన రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరం. ఉద్యోగ - వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. జీవిత భాగస్వామితో చికాకులు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బ్యాంకింగ్ - ఫైనాన్స్ - చిట్స్ రంగాల వారికి ఒత్తిడి - పనిభారం.

మీనరాశి: రక్షణ - న్యాయ - బోధన రంగాల వారికి నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యాజ్యాలు - వివాదాలు కొలిక్కివస్తాయి. అవసరాలకు కావాల్సిన ధనం అందుతుంది.