Begin typing your search above and press return to search.

అక్టోబర్ 31 బుధవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   31 Oct 2018 1:31 AM GMT
అక్టోబర్ 31 బుధవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు. రియల్ ఎస్టేట్ ల వారికి సమస్యలు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. రాజకీయ వేత్తలు - కళాకారులకు నిరాశ తప్పదు. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. గణపతిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆస్తివివాదాల నుంచి విముక్తి. రాబడి పెరుగుతుంది. రుణాలు తీరుతాయి. రియల్ ఎస్టేట్ లు - కాంట్రాక్టర్లకు అనుకూలం. ఉద్యోగాల్లో పదోన్నతులు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు పురోగతి. మహిళలకు సంతోషం కలిగించే ప్రకటనలు. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అసంతృప్తి. పారిశ్రామికవేత్తలు - కళాకారులు నిరాశ చెందుతారు. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు అనారోగ్యం. దుర్గామాతకు అర్చన చేయండి.

కర్కాటకరాశి: వాహనాలు - ఆభరణాలు కొంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడుతారు. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. రాజకీయ - సాంకేతిక రంగాల వారికి కొత్త అశలు. ఐటీ నిపుణులకు అవకాశాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు విజయాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

సింహరాశి: ఖర్చులు మీదపడుతాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాంట్రాక్టర్లకు చికాకులు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక - రాజకీయ - కళారంగాల వారికి కొంత నిరాశ తప్పదు. ఐటీ నిపుణులు కొంత నిదానం పాటిస్తే మంచిది. విద్యార్థులు విద్యావకాశాల వేటలో పడుతారు. మహిళలకు మానసిక ఆందోళన. అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: నిరుద్యోగులకు ఇంటర్వ్యు కాల్ వస్తాయి. సభలు - సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ ల వారికి ఒత్తిడులు తొలుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలిగి ఊరట చెందుతారు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు అనుకోని ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. మహిళలకు ఉత్సాహాన్నిచ్చే వార్తలు - విద్యార్థులకు ఊహించని ఫలితాలు. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

తులరాశి: కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాల్లో చేరుతారు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు శుభవార్తలు. ఐటీ నిపుణులు అంచనాలు అందుకుంటారు. విద్యార్థులకు ఫలితాలతో ఊరట. మహిళలకు గౌరవం. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. రియల్ ఎస్టేట్ ల వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపార లావాదేవీల్లో మందకొడిగా ఉంటాయి.ఉద్యోగాల్లో పనిభారం. కళాకారులు - రాజకీయ వర్గాలకు పర్యటనలు రద్దు అవుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.మహిళలకు మానసిక ప్రశాంతత. శివాష్టకం పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆదాయం అంతగా ఉండదు. అనుకోని ఖర్చులు . ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. రియల్టర్లు - కాంట్రాక్టర్లకు సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు మరింత శ్రమపడితే ఫలితం. మహిళలకు స్వల్ప అనారోగ్యం. విష్ణు ధ్యానం చేయండి.

మకరరాశి: వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ లు - కాంట్రాక్టర్లకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.కళాకారులు - పారిశ్రామిక వేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. ఐటీ నిపుణులకు మరింత అనుకూలం. మహిళలకు ఆస్తి లాభాలు. దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తే మంచిది.

కుంభరాశి: రాబడి పెరిగి అప్పులు తీరుతాయి. వివాదాల నుంచి బయటపడుతారు. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. కళాకారులు - రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలుగుతాయి. ఐటీ నిపుణులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం.మహిళలకు సన్మానాలు. హయగ్రీయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆదాయం కంటే ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు లేనిపోని సమస్యలు. వ్యాపారాల్లో తొందరపాటు వద్దు. కళాకారులు - రాజకీయవర్గాల వారికి గందరగోళ పరిస్థితి. ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠిస్తే మంచిది.