Begin typing your search above and press return to search.

నవంబర్ 1 గురువారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   1 Nov 2018 1:35 AM GMT
నవంబర్ 1 గురువారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: రాబడి తగ్గి నిరాశ కలుగుతుంది. మానసిక అశాంతి. ప్రముఖులను కలుసుకొని సహాయం కోరుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహవంతం. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలం. ఉద్యోగులకు మార్పులు. కళాకారులు - పారిశ్రామిక వేత్తలకు పర్యటనల్లో మార్పులు. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. విద్యార్థులకు అనుకున్న విద్యావకాశాలు. మహిళలకు చికాకులు. ఆంజనేయ దండకం పాఠిస్తే మంచిది.

వృషభరాశి: ఆకస్మిక ధన ప్రాప్తి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ ల వారికి కొత్త ఆశలు. వ్యాపారాలు సకాలంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతం. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులు లక్ష్యాలు చేరుకుంటారు. మహిళలకు కుటుంబ, ఆరోగ్య సమస్యలు. నవగ్రహ స్తోత్రాలు పాఠిస్తే మంచిది.

మిథునరాశి: రాబడి తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. వ్యాపారాల్లో కొంత ఆందోళన. కళాకారులకు అవకాశాలు కోల్పోతారు. రాజకీయ వర్గాలకు పదవులు చేజారుతాయి. ఐటీ నిపుణులు కొంత నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బుధగ్రహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి సంతోషకరమైన సమాచారం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. పారిశ్రామిక - కళారంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతం. విద్యార్థులకు పురస్కారాలు. మహిళలు ఉత్సాహంగా ముందుకుసాగుతారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

సింహరాశి: అప్పులు చేస్తారు. పరిస్థితులు అనుకూలించవు. ఖర్చు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు చికాకులు. వ్యాపారాల్లో కొంత నిరాశ. ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి. కళాకారులు, రాజకీయ వర్గాల వారిపై విమర్శలు. ఐటీ నిపుణులకు మందకొడిగా సాగుతుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అన్నపూర్ణాష్టకం పఠిస్తే మంచిది.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు మరింత లాభం.. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో ఉన్నతమైన హోదాలు. పారిశ్రామిక - కళారంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశఆలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు గౌరవం, సన్మానాలు. అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: భూవివాదాలు పరిష్కారం. రియల్ ఎస్టేట్ వారికి కేసుల పరిష్కారం. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతలు సంభవం.. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని పదవులు. ఐటీ నిపుణులకు ఒక ముఖ్య సమాచారం. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి. మహిళలకు సన్మానాలు. షిర్డీసాయి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాక ఇబ్బందులు. కళాకారులు, రాజకీయవర్గాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది. మహిళలకు ఆరోగ్యభంగం. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆస్తి వివాదాలతో ఇబ్బందులు. రాబడి తగ్గే సూచనలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ - కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులు నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. శివాష్టకం పఠిస్తే మంచిది.

మకరరాశి: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. కాంట్రాక్టులు కైవసం. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామిక కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులు సత్తా నిరూపించుకుంటారు. విద్యార్థులకు పరిశోధనలు సత్ఫలితాలిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు. రామరక్షా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాలు సాదాసీదా.. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ, కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు అవాకాశాలు చేజారుతాయి. మహిళలకు స్వల్ప అనారోగ్యం. విష్ణు సహస్రనామా పారాయణం చేస్తే మంచిది.

మీనరాశి: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు విరమిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులు మరింత శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ఫలితాల పట్ల కొంత నిరాశ. మహిళలకు కొంత ఆందోళనకరం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.