Begin typing your search above and press return to search.

జనవరి 1 మంగళవారం 2019 దినఫలాలు

By:  Tupaki Desk   |   1 Jan 2019 1:30 AM GMT
జనవరి 1 మంగళవారం 2019 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడుతారు. ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాల్లో అభివృద్ధి. రాజకీయ - కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. ఐటీ నిపుణులకు ఊహించని అభివృద్ధి. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. అందరిలో గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: బంధువర్గంతో విబేధాలు. ఉద్యోగుల్లో అనుకోని మార్పులు. ఐటీ ఉద్యోగులు మరింత శ్రమించాలి. ఒప్పందాల్లో అవరోధాలు. అనుకోని ఖర్చులు. పారిశ్రామిక - రాజకీయరంగాల వారికి చికాకులు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు చికాకులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: రాబడి అంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. కుటుంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు ఒడిదుడుకులు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక - రాజకీయ రంగాల వారికి మానసిక అశాంతి. విద్యార్థులకు నిరాశాజనకం. ఐటీ ఉద్యోగులకు శ్రమాధిక్యం. మహిళలకు కటుంబంలో సమస్యలు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: రుణబాధల నుంచి విముక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు చేపడుతారు. బంధువులను కలుసుకొని కుటుంబ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయ - కళారంగాల వారికి విదేశీ ప్రయాణాలు. ఐటీ ఉద్యోగులకు అనుకోని ఆహ్వానాలు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. శ్రీరామమరక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండదు. కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక లావాదేవీల్లో ఆటుపోట్లు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. రాజకీయ - కళారంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు కొన్ని మార్పులు పొందుతారు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు సోదరుల నుంచి కలహాలు. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

తులారాశి: అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఆశాజనకం. ఐటీ ఉద్యోగుల ఆశలు తీరతాయి. విద్యార్థులకు శుభ సమాచారం. మహిళలకు మానసిక ప్రశాంతత. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. రాజకీయ వర్గాల వారికి అవకాశాలు చేజారుతాయి. ఐటీ నిపుణులకు వివాదాలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు పనిభారం. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: మీ అంచనాలు నిజమవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ప్రణాళికను రూపొందించుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారు అనుకున్న ప్రగతి సాధిస్తారు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీయానం. ఐటీ ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు భూలాభాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు. ఐటీ ఉద్యోగులకు రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. సుబ్రహ్మణ్వేశ్వరుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: శ్రమతో పనులు పూర్తి చేస్తారు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధుమిత్రులతో విరోధాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు సమస్యలు ఎదురుకావచ్చు. గణేశ్ స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: బంధువులతో విబేధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాల్లో నిదానం అవసరం. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక - రాజకీయ వర్గాల వారికి ఆలోచనలు కలిసిరావు. ఐటీ ఉద్యోగులు శ్రమించాలి. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. మహిళలకు మానసిక ఆందోళన. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.