Begin typing your search above and press return to search.

జనవరి 11 శుక్రవారం 2019 దినఫలాలు

By:  Tupaki Desk   |   11 Jan 2019 1:30 AM GMT
జనవరి 11 శుక్రవారం 2019 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి పురస్కారాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ ఉద్యోగులకు సానుకూలంగా ఉంది. విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. గణేశాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: అదనపు రాబడి ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహకరం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఐటీ ఉద్యోగులకు విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. వెంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మిథున రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త రుణాలు చేస్తారు. ఇంటాబయటా బాధ్యతలును సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు అంతగా ప్రోత్సాహం లభించదు. పనులు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. ఐటీ ఉద్యోగులకు నిరాశాజనకం. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. మహిళలకు అనారోగ్యం. శివపంచాక్షరి పఠనం మంచిది.

కర్కాటక రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. రియల్ ఎస్టేట్ వారికి సామాన్య స్థితి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. ఐటీ ఉద్యోగులు కొంత వెనుకబడిపోతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కష్టమే. మహిళలకు ఆరోగ్య సమస్యలు. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. రుణదాతలకు ఒత్తిడులు తప్పవు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలగుతాయి. వస్తు, వాహన లాభాలున్నాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతి ఆశలు చిగురిస్తాయి. రాజకీయ నాయకులకు పదవీయోగం. ఐటీ ఉద్యోగులకు పురస్కారాలు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా సాగుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. హనుమాన్ పూజలు చేయడం మంచిది.

కన్యారాశి: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుంది. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. ఆస్తి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా ఆగ్రిమెంట్లు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు సానుకూలం. వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు మహిళలకు ఇంటి సమస్యలు తీరతాయి. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రులే శత్రువులుగా మారతారు. కుటుంబ సభ్యులతో విబేధాలు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందికర పరిస్థితి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులుంటాయి. ఐటీ ఉద్యోగులు నిదానం పాటించాలి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి నిరుత్సాహం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించలేక నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్య సూచనలు. గణపతిని పూజించడం మంచిది.


వృశ్చిక రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగుల అంచనాలు తప్పుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు ఫలించవు. వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశ. ఐటీ ఉద్యోగులకు సమస్యలు పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. నవగ్రహా స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని వివాదాలను ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లు - రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగుల సేవలకు సరైన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాలకు పురస్కారాలు. ఐటీ ఉద్యోగులకు పనిభారం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. గణేశ్ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటాబయటా కొన్ని ఇబ్బందులు నెలకొంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు సఫలం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు. ఐటీ ఉద్యోగులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులు నిదానం పాటించాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కుంభరాశి: విలువైన వస్తువులు - వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక - రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ నిపుణులకు కలిసొచ్చే సమయం. విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలకు ఆస్తి లాభం. దుర్గా స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు మధ్యలోనే ఆపివేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉన్నా ఏ లోటు ఉండదు. బంధువులతో తగాదాలను పరిష్కరించుకుంటారు. ఒక సమాచారం గందరగోళం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి గందరగోళ పరిస్థితులు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.