Begin typing your search above and press return to search.

ఘోరమిదీ: దేశంలో లాక్ డౌన్ ఫెయిల్..

By:  Tupaki Desk   |   29 March 2020 4:43 AM GMT
ఘోరమిదీ: దేశంలో లాక్ డౌన్ ఫెయిల్..
X
కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు ప్రధాని నరేంద్రమోడీ. జనాలు ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. ఓ రకంగా కర్ఫ్యూనే విధించారు. అత్యవసరాలకు నిత్యావసరాల కోసం తప్పితే బయటకు రావద్దని సూచిస్తున్నారు.

అయితే తాజాగా లాక్ డౌన్ ఢిల్లీ లో ఘోరంగా విఫలమైంది. ఢిల్లీకి పని నిమిత్తం వచ్చిన వేలాది మంది వలస కూలీలు, ఢిల్లీలో ఉంటున్న బీహార్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వలసవాసులు సొంతూళ్లకు వెళ్లేందుకు రోడ్లపైకి వచ్చారు. లాక్ డౌన్ తో సర్వం బంద్ కావడంతో తిండి దొరకని పరిస్థితిలో తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. బస్టాండ్ కు పోటెత్తారు. సామూహికంగా.. గుంపులుగా వీరంతా రావడంతో లాక్ డౌన్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. వీరిలో ఒక్కరికి కరోనా ఉన్నా మిగతా వారికి రావడం ఖాయం.. వేలాది మంది రోడ్డెక్కడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తారు.

కిక్కిరిసి పోయిన వేలాది మంది వలస కార్మికులు కాలినడకన బస్ స్టేషన్ కు వచ్చి బస్సుల్లో వెళ్లడానికి గుమిగూడిన ఫొటోలు దేశవ్యాప్తంగా భయం గొల్పాయి. ఒకరినొకరు రాసుకొని ఉండడం.. దగ్గరగా ఉండడంతో కరోనా సోకిన వారుంటే పెద్ద ఉపద్రవమే సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉన్న ఫళంగా.. కనీసం కూలీలు - ఇతర ఉద్యోగులు - కార్మికులు సొంతూళ్ల వెళ్లేందుకు కూడా సర్కారు టైం ఇవ్వకపోవడంతో వారంతా ఆకలికేకలతో అలమటిస్తున్నారు. పనిలేక పస్తులుంటున్నారు. బస్సులు, రైళ్లు బంద్ కావడంతో ఇలా సామూహికంగా రోడ్డెక్కారు. రోడ్డు పక్కన జీవించే వారు, కూలీలు, చిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా మోడీ సర్కారు వేసిన లాక్ డౌన్ పర్యవసనాలు ఇప్పుడు కళ్లారా కనిపిస్తున్నాయి.