Begin typing your search above and press return to search.

ఐటీ అధికారుల‌పై వంద‌లాది గేద‌ల్ని వ‌దిలారు

By:  Tupaki Desk   |   4 Jun 2017 4:56 PM GMT
ఐటీ అధికారుల‌పై వంద‌లాది గేద‌ల్ని వ‌దిలారు
X
ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు వ‌స్తున్నారంటే చాలు.. ఎంత పెద్దోళ్ల గుండెల్లో అయినా రైళ్లు ప‌రిగెడ‌తాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో ఐటీశాఖ అధికారుల‌కు ఊహించ‌ని చేదు అనుభ‌వం ఎదురైంది. త‌మ‌పై దాడుల‌కు వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న పాల వ్యాపారులు చేసిన ప‌ని ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని జ‌బ‌ల్‌ పూర్‌ లో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తోంది.

జ‌బ‌ల్‌ పూర్ లోని ప‌రియ‌త్ న‌దిఒడ్డున ఉన్న ఇమ్లియా గ్రామంలో దాదాపు 20 డెయిరీల‌ను అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న‌ట్లుగా స‌మాచారం అందుకున్నారు ఐటీ అధికారులు. ఆ సంగ‌తేమిటో చూసేందుకు వారు త‌నిఖీల నిమిత్తం అక్క‌డ‌కు వెళ్లారు. త‌మ అక్ర‌మాల్ని బ‌య‌ట‌పెట్టేందుకు అధికారులు త‌నిఖీల నిమిత్తం వ‌స్తున్నార‌న్న విష‌యాన్ని తెలుసుకున్న వారు.. అధికారుల మీద‌కు వంద‌లాది గేదెల్ని వ‌దిలారు. డెయిరీలోకి రాకుండా ఉండేందుకు షెడ్‌ లో ఉన్న 500 గేదెల్ని వారి మీద‌కు వ‌ద‌ల‌టంతో ఏం చేయాలో తోచ‌ని ప‌రిస్థితి. ఒక్క‌సారిగా వంద‌లాది గేదెలు రోడ్డు మీద‌కు రావ‌టంతో కొన్ని గంట‌ల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక్క‌సారిగా వంద‌లాది గేదెలు రోడ్ల మీద‌కు రావ‌టంతో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు గేదెల్ని నిలువ‌రించే క్ర‌మంలో ప‌లుమార్లు కాల్పులు జ‌రిపారు. దీంతో అక్క‌డి వ్యాపారులు పోలీసులు మీద రాళ్ల‌దాడి జ‌రిపారు. ఈ ఉదంతానికి సంబంధించి ప‌లువురు వ్యాపారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏమైనా ఐటీ అధికారుల మీద వంద‌లాది గేదెల్ని వ‌ద‌ల‌టం సంచ‌ల‌నంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/