Begin typing your search above and press return to search.

ద‌ళిత బంధు దేశ‌వ్యాప్తం.. టీఆర్ ఎస్ సంచ‌ల‌న తీర్మానం

By:  Tupaki Desk   |   27 April 2022 10:30 AM GMT
ద‌ళిత బంధు దేశ‌వ్యాప్తం.. టీఆర్ ఎస్ సంచ‌ల‌న తీర్మానం
X
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి... సుమారు ఎనిమిదేళ్లు నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. యవ్వన దశకు చేరింది. టీఆర్ ఎస్‌ 21వ వ్యవస్థాపక దినోత్సవం(ప్లీన‌రీ) హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. ఈ ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు సిద్ధ‌మ‌య్యాయి. వ‌చ్చే ఏడాది కాలంలో ఈ తీర్మానాలను అమ‌లు చేయ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల్లోకి కూడా తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

ఇవీ తీర్మానాలు..

+ యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన

+ దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలి

+ ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేయాలి.

+ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసి అమలు చేయాలి.

+ దేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

+ బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్‌.

+ తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని డిమాండ్‌.

+ రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్లోనే పన్నులు వసూలు చేయాలని డిమాండ్‌.

+ నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్‌.

+ రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి.

+ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్.

+ చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్.

+ దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం.