Begin typing your search above and press return to search.
ప్రపంచానికే దళిత బంధు ఆదర్శం.. కేసీఆర్ సమగ్ర వివరణ
By: Tupaki Desk | 27 April 2022 1:30 PM GMTదళితబంధు దేశానికి, ప్రపంచానికే ఆదర్శం కాబోతోందని టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దళితులలో ఎంతో మంది ప్రతిభా సంపన్నులకు ఇప్పటివరకు అవకాశాలు లేవన్నారు. శక్తి ఉన్నా, పైకి రావాలనే ఆలోచన ఉన్నా అవకాశం లేకనే వెనుకపడ్డారన్నారు.
ఆరేడేళ్లలో భారత సమాజానికే తెలంగాణ ఎస్సీ సమాజం ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దళితబంధు అంటే రూ.10 లక్షలు ఇవ్వడం కాదని.. ఆ లక్ష్యాలను తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అమలు చేస్తోందన్నారు.
మూడు ముచ్చట్లు!దళితబంధులో మూడు కార్యక్రమాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 17.50 లక్షల కుటుంబాలకు దశలవారీగా 2 నుంచి రెండున్నర లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇందులో కిస్తీలు, కిరికిరిలు, బ్యాంకులో తిరిగి కట్టేది ఏదీ లేదన్నారు. దళితులు వారికి నచ్చిన, వారు మెచ్చిన పనిని చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు.
మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులు, హాస్టల్ సఫ్లై, ఆసుపత్రి సఫ్లైలో, వైన్ షాపులు, బార్ షాపుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేశామన్నారు. తెలంగాణలో 261 షాపులను దళితబిడ్డలు నడుపుతున్నారని సీఎం వెల్లడించారు. దళితబంధులో ఆర్థిక ప్రేరణ, అన్నింట్లో రిజర్వేషన్లు కల్పించడం, ప్రపంచంలోనే ఎక్కడా లేనటుంవంటి సపోర్టు అందించామన్నారు.
రక్షణ నిధి కూడా!దళితబంధు లబ్ధిదారుల రక్షణ కోసం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ దళిత రక్షణ నిధి లో 10వేలు లబ్ధిదారుని నుంచి, ప్రభుత్వం మరో 10 వేలు కలిపి ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతిని ధులందరూ ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు.
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడంలో రాష్ట్రం ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. గాంధీనే దూషణలు చేసే స్థితికి దేశం చేరుకుంటోందని.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి జాతిపితగా ఎదిగిన వ్యక్తికి ఇదా గౌరవం అని ఆయన ప్రశ్నించారు. దేశంలో మతవిద్వేషం మంచిదా?.. ఇది ఎక్కడికి దారితీస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.