Begin typing your search above and press return to search.
బండారం బయటపెడుతా..రేవంత్ ముందు దళిత మహిళ ఆగ్రహం
By: Tupaki Desk | 14 Jan 2020 10:42 AM GMTతెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీల్లోని అంతర్గత విబేధాలను రచ్చకు ఎక్కిస్తున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా నేతలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కౌన్సిలర్ టిక్కెట్ల లొల్లి రచ్చకెక్కింది. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాళ్ల మీద పడి టిక్కెట్ కేటాయించాలని ఓ దళిత మహిళ అడుక్కునే ప్రయత్నం చేసింది. అయితే, రేవంత్ ఆమెను దాటుకుంటూ వెళ్లిపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దళితులను అణగదొక్కాలని - కాళ్లమీద పడ్డ తన్నుకుంటూపోవడం కించపరుచడమేనని దళిత మహిళ ఆరోపించింది. టిక్కెట్ ఇవ్వకుంటే బండారం మొత్తం బయటపెడుతామని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ - మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి - డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ - మాజీ ఎమ్మెల్యే కేఎల్ ఆర్ తదితరులు మేడ్చల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వారిలో బయట ఉన్న ఆ పార్టీ నేతలు కొంతమంది తమను లోపలికి రానివ్వలేదని విమర్శిస్తూ - నాలుగు గంటల పాటు బయట నిలబెట్టి, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారిని లోపల కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు తీవ్ర విమర్శలు చేశారు. కష్టపడి పని చేసిన వారిని పార్టీలో అన్యాయం చేస్తున్నారని దళిత మహిళ సుద ఆవేదనతో తీవ్రంగా ధ్వజమెత్తుతూ - ఒకే ఇంటికి రెండు టికెట్లు కేటాయించిన పార్టీ నేతలు 40 ఏళ్లుగా పార్టీలో కట్టుబడి పని చేసిన మా కుటుంబానికి 21వ వార్డులో కౌన్సిలర్ టిక్కెట్ ఇవ్వకుండా దళితులమని చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించింది. మున్సిపల్‌లోని ఒకటో వార్డులో టిక్కెట్ ఇస్తామని మోసం చేసి 8 నెలల క్రితం వచ్చిన వారికి కట్టబెట్టి 20 ఏళ్లుగా పని చేస్తున్న తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీ నేత సుబ్చారావు తీవ్ర పదజాలంతో నేతలను బహిరంగంగా విమర్శించాడు. రేవంత్ రెడ్డిని - కేఎల్ ఆర్ ను కలువకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ కంటతడి పెట్టాడు. మేడ్చల్ కు చెందిన మరో మహిళ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ క్రమంలో కార్యాలయం లోపల నుంచి రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న విషయాన్ని గమనించిన దళిత మహిళ ప్రధాన గుమ్మంలో కింద కూర్చొని ఆయన కాళ్ల మీద పడి అడ్డుకోవడానికి ప్రయత్నించగా పట్టించుకోకుండా దాటుకుంటూ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయారు. అటు వెనుకాలే వచ్చిన కేఎల్ ఆర్ ను నిలదీసి తమకు టిక్కెట్ కేటాయించాలని డిమాండ్ చేయడంతో లొల్లిలొల్లిగా మారింది.