Begin typing your search above and press return to search.
ఆమె పట్ల మంత్రి అచ్చెన్న అలా వ్యవహరించారట
By: Tupaki Desk | 28 March 2017 4:53 AM GMTపవర్ లో ఉన్న వారికి సహజ సిద్ధంగా వచ్చేసే అధికారాన్ని వీలైనంత వరకూ ప్రజలకు ఉపయోగించే పనుల మీద ఫోకస్ చేస్తే.. అధికారం మరింత కాలం చేతిలోనే ఉంటుంది.అయితే.. ఈ చిన్న విషయాన్ని పవర్ లో ఉన్నవారెవరూ పెద్దగా పట్టించుకోని వైనం తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇక..ఏపీ అధికారపక్ష నేతల విషయానికి వస్తే.. వారిపై వస్తున్న విమర్శలు.. ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
మహిళా ఎమ్మార్వో వనజాక్షి మొదలుకొని.. నిన్నటి ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం వరకూ ఏపీ అధికారపక్ష నేతల దురుసుతనానికి బాధితులే. పవర్ లో ఉన్నప్పుడేం చేయకూడదో.. సరిగ్గా అదే చేస్తున్న ఏపీ తెలుగుదేశం నేతల తీరును తప్పు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు వ్యవహరించిన అభ్యంతరకర అంశంపై హడావుడి ఒక కొలిక్కి రాక ముందే.. మరో సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుట్టుకోనుంది.
న్యాయం చేయాలని కోరుతూ మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లిన తమను కొట్టారంటూ దళిత ఉద్యోగిని కళ్యాణి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆమె విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ను కలిసి కంప్లైంట్ చేవారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఆమెన్ గ్యాంగ్ మజ్దూర్ గా పనిచేస్తున్న తనను ఎస్ ఈ రామచంద్రన్ గడిచిన మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తూ.. ఏడాది నుంచి జీతం ఇవ్వట్లేదని ఆమె ఆరోపించారు.
ఈ అంశంపై తనకు న్యాయం చేయాలని గత డిసెంబరులో మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లానన్నారు. తన గోడు పట్టించుకోని అచ్చెన్నాయుడు.. సెక్యూరిటీ సిబ్బందితో నెట్టివేశారని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. తన వెతలపై సీఎం సానుకూలంగా స్పందించి రూ.25వేల నగదు ఇచ్చి.. సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఆ హమీ నెరవేరలేదని వాపోయారు. అదేంది అచ్చెన్న.. ఆడబిడ్డ న్యాయం కోసం వస్తే అలా వ్యవహరించటం ఏంటి..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/