Begin typing your search above and press return to search.
`దళిత బంధు`-వెనుక.. కేసీఆర్ నిజస్వరూపం..బయట పడుతోందా?
By: Tupaki Desk | 26 Aug 2021 8:31 AM GMTఔను.. ఇప్పుడు ఇదే మాట తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ .. వరుసగా రెండో సారి కూడా అధికారంలోకి వచ్చి.. రెండేళ్లు పూర్తయిపోయింది. అయితే.. అనూహ్యంగా ఇప్పటి వరకు ఆయన మౌనంగా ఉండి.. సడెన్‌గా.. దళిత బంధును ప్రకటించి.. దళితలపై మునుపెవ్వరూచూపని ఆప్యాయతను ఒలకబోసేశారు. అంతేకాదు.. తాను తీసుకువచ్చిన దళిత బంధుతో .. ఆయా సామాజిక వర్గాలు ఆర్థిక సాధికారతను సాధిస్తాయని.. సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధి పొందుతారని.... సీఎం ప్రకటించారు.
అయితే.. ఇప్పటి వరకు లేని దళిత ప్రేమను.. ఇప్పుడు కేసీఆర్ చూపించడంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలేమిటనేది.. చిన్నారిని అడిగినా.. చెబుతాడని అంటారు పరిశీలకులు. ఈ పథకం వెనుక.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను శంకరగిరి మాన్యాలకు పంట్టించడమనే రీజన్ ఉందని అంటు న్నారు పరిశీలకులు. త్వరలోనే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని తీసుకువచ్చిన కేసీఆర్.. ఏమాత్రం వెనుకాడకుండా.. ఇదే నియోజవకర్గాన్ని.. పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించడం.. గమనార్హం.
నిజానికి రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితులు ఎక్కడా లేనట్టుగా.. ఒక్క హుజూరాబాద్‌నే కేసీఆర్ ఎంచుకోవడం.. విమర్శలకు దారితీసింది. అయినా.. ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా.. రాజకీ యాలు చేస్తే.. తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ అంచనామేరకు దళిత బంధు పథకం మొత్తం 17 లక్ష ల దళిత కుటుంబాలకు అమలు చేయనున్నారు. దీని ప్రకారం.. కోటీ 70 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం దళితులకు అందించనుంది. ఇదిలావుంటే.. హుజూరాబాద్‌లో 23 వేల కుటుంబాలకు దళిత బంధును అమలు చేయాల్సి ఉంది. అయితే, సర్వేల పేరుతో ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా నిధులు అందించకపోవడం గమనార్హం.
దీనికి ప్రధాన కారణం.. ప్రభుత్వం దగ్గర నిదులు లేకపోవడం గమనార్హం. ఇక, అధికారులు.. ఈ నెల 26 నుంచి సెప్టెంబరు 2 వరకు హుజూరాబాద్‌లో సర్వే చేయనున్నారు. ఈ క్రమంలో దళిత కుటుంబాలకు.. ఐదు ఎకరాల భూమి, సొంత ఇల్లు, కారు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాయా? వంటి అనేక విషయాలను ఈ సర్వేలో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. అయితే.. ఇవన్నీ తెలుసుకున్నాక.. కేసీఆర్.. వీరికి దళిత బంధును అమలు చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. దీనిని బట్టి.. దళిత బంధుపై కేసీఆర్.. కొన్ని ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు.. ఇప్పటికే 15 దళిత కుటుంబాలకు ఈ నెల 16న కేసీఆర్ స్వయంగా రూ.10 లక్షల రూపాయల చెక్కులు అందించారు. అయితే.. ఆయా కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఈ నిధులు జమ కాకపోవడం గమనార్హం. ఇదిలావుంటే.. హుజూరాబాద్‌లో ఈ పథకం పూర్తిగా అమలయ్యేందుకు.. కనీసం ఏడాది కాలం పడుతుందని.. అధికారులు చెబుతుండడం గమనార్హం. మరి దీనిని బట్టి.. రాష్ట్రం మొత్తం దళత బంధు అమలయ్యేందుకు ఎన్ని దశాబ్దాలు పడుతుందోనని.. విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే తమకు ఇచ్చిన హామీల మేరకు సీఎం పోస్టును ఇవ్వలేదని, మూడు ఎకరాల భూమిని కూడా ఇవ్వలేక పోయారని.. దళిత ప్రజలు కేసీఆర్‌పై గుర్రుగా ఉండడం గమనార్హం.