Begin typing your search above and press return to search.
100 నోట్ల షార్టేజీకి తిరుగులేని సాక్ష్యమిదేనట
By: Tupaki Desk | 18 Nov 2016 6:41 AM GMTనోట్ల కొరత లేనే లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది కేంద్ర సర్కారు. కేంద్ర ఆర్థిక మంత్రి మొదలు ఆర్థిక శాఖకు చెందిన ముఖ్యనేతలంతా దేశంలో నోట్ల కొరత లేదని.. ప్రభుత్వం దగ్గర చిల్లర నోట్లు తగినన్ని ఉన్నాయని.. కొరత కేవలం పుకారుగా కొట్టిపారేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేంద్ర పెద్దలు చెబుతున్న మాటలకు.. బ్యాంకుల్లో పరిస్థితికి ఏ మాత్రంపొసగటం లేదన్న వాదన వినిపిస్తోంది.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులు రూ.2వేల నోటు.. రూ.100 నోట్లను పంపిణీ చేస్తోంది. కొత్తగా రూ.500నోట్లను విడుదల చేసినట్లు చెప్పినా.. దేశ వ్యాప్తంగా ఆ నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటం లేదన్న మాటను మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. రూ.100నోట్లకు సంబంధించి బ్యాంకు అధికారులు చెబుతున్న మాటలు.. అందుకు తగ్గట్లుగా చూపిస్తున్న నోట్ల కట్టలు సామాన్యుల్ని బెదిరిపోయేలా చేస్తున్నాయట.
నోట్ల కొరత లేదని చెబుతున్నకేంద్రం మాటలకు భిన్నంగా.. బ్యాంకులకు వస్తున్న రూ.100 కట్టలు చాలా పాతవిగా ఉండటం.. పెద్ద పెద్ద బండిల్స్ ప్యాక్ చేసి వస్తున్నాయని.. వాటిని ఓపెన్ చేసి చూస్తే.. అవన్నీ పాత నోట్లుగా ఉండటం.. వాటిల్లో చాలా వరకూ డ్యామేజ్ నోట్లు కూడా ఉండటాన్ని రుజువుగా చూపిస్తున్నారు. కేంద్రం వద్ద తగినన్ని నోట్లు ఉన్న పక్షంలో ఇంత పాత నోట్లను చెల్లుబాటులోకి ఎలా తీసుకొస్తారు? అని ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
బ్యాంకులకు వస్తున్న నోట్లలో బాగా పాతబడినవి.. డ్యామేజ్ నోట్లు వస్తున్నాయని.. వాస్తవానికి ఈ తరహా నోట్లను ఆర్ బీఐకి బ్యాంకులు పంపుతాయని.. ఇప్పుడు అవే నోట్లు తమ వద్దకు వస్తున్న విషయాన్ని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పుడు బ్యాంకులకు వస్తున్న రూ.100 కట్టల్లో చాలావరకూ అలాంటి నోట్లే ఉంటున్నాయన్న వాదనను బ్యాంకు సిబ్బంది వెల్లడిస్తున్నారు. పలు బ్యాంకుల బయట ఉన్న గార్డులు సైతం ఇదే విషయాన్ని చెబుతూ.. క్యూలో ఉన్న వారిని అలెర్ట్ చేస్తుండటం గమనార్హం. రూ.100 నోట్ల కంటే రూ.2వేల నోట్లు తీసుకోవాలన్న సలహా ఇవ్వటం కనిపిస్తోంది. రూ.2వేల నోటు తీసుకుంటే చిల్లర కష్టం కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘‘చిల్లర కోసం కష్టపడాలనుకుంటున్నారా? పాత నోట్లను తీసుకొని మళ్లీ బ్యాంకులకు వచ్చే పని పెట్టుకుంటే మీ ఇష్టం’’ అని వ్యాఖ్యానించటం కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు ఒకరకంగా షాకిస్తే.. తాజాగా బ్యాంకుల్లోఇస్తున్న రూ.వంద నోట్లు మరోలా వణికిస్తోందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/