Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను డ్యామేజీ చేసి మా సైడ్ రండి... కాంగ్రెస్ సీనియర్స్ తో బీజేపీ!

By:  Tupaki Desk   |   19 Dec 2022 11:30 AM GMT
కాంగ్రెస్ ను డ్యామేజీ చేసి మా సైడ్ రండి... కాంగ్రెస్ సీనియర్స్ తో బీజేపీ!
X
ఓవైపు కేసీఆర్ ఎత్తులు.. మరోవైపు బీజేపీ చిత్తులు.. ఈ రెండింటి రాజకీయ సంగ్రామానికి మధ్యలో కాంగ్రెస్ నలిగిపోతోంది. వాళ్లిద్దరూ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. బలహీన పరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచే నేతలను లాగుతున్నారు. కొందరినీ కోవర్టులుగా మార్చి రాజకీయంగా వాడుకుంటున్నారు. కనీసం గత మూడు సార్లు సీట్లు ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలవని వాళ్లు.. ఓడిపోయినా సరే కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నారని మళ్లీ సీట్లు ఇచ్చినా గెలవాలని వాళ్లు కూడా ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నోరుపారేసుకుంటున్నారంటే కాంగ్రెస్ లో పరిస్థితి ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.

నిజామాబాద్ ఎంపీగా అప్పుడెప్పుడో వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం వల్ల.. ఆయన దయతో ఆయన గాలిలో గెలిచిన నేత మధుయాష్కీ. అసలు నిజామాబాద్ ప్రజలకు ముక్కు మొహం కూడా తెలియని ఈ నేత వైఎస్ఆర్ గాలిలోనే గెలిచేశాడు. వైఎస్ఆర్ మరణం తర్వాత గత రెండు సార్లు కూడా టికెట్ ఇచ్చినా కూడా నిజామాబాద్ లో గెలవలేదు. అసలు మధుయాష్కీకి ఇప్పుడు నిజామాబాద్ లో అసలు పట్టు కూడా లేదు. ఈయన ఫెయిత్ మొత్తం పడిపోయింది.

ఈయనే కాదు.. కాంగ్రెస్ పెద్దాయన వీ.హనుమంతరావుది పేరు గొప్ప ఊరు దిబ్బలాంటి పరిస్థితి. అంబర్ పేటలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తే డిపాజిల్ కూడా తెచ్చుకోకుండా ఘోరంగా ఓడిపోయాడు. ఇక రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ ఆంథోల్ నియోజకవర్గంలో కనీసం క్యాడర్ కూడా లేదు. గత ఎన్నికలకు ముందు దామోదర సతీమణి బీజేపీ కండువా కప్పుకొని పోటీకి రెడీ అయ్యి మళ్లీ భర్త పరువు పోతుందని తెలిసి వెనక్కి వచ్చేసింది.

ఇక పీసీసీ చీఫ్ గా గతంలో చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ సంబంధాలు ఉన్నాయన్న టాక్ ఉంది. నిర్మల్ జిల్లా నేత మహేశ్వర్ రెడ్డి ఒక్కసారి కూడా కాంగ్రెస్ తరుఫున గెలవలేదు. సంగారెడ్డిలో గెలిచిన జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నోటీదూల ఎక్కువ ఉండడం వల్ల పార్టీకి మైనస్ గా మారుతున్నాడు.

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయ్యాక యువతకు పెద్దపీట వేస్తున్నారు. కాంగ్రెస్ లోకి కొత్త రక్తం వచ్చి ఫైట్ చేస్తేనే గెలుస్తాం తప్పితే కాంగ్రెస్ బతకదు అని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించి రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేసింది. కాంగ్రెస్ గెలవకపోయినా ఫర్వాలేదు కానీ రేవంత్ రెడ్డి సీఎం కావద్దు అని సీనియర్లు అంతా కూడబలుక్కొని రాజకీయాలు మొదలుపెట్టారు. తాజాగా రహస్యభేటిలో అసమ్మతి రాజేస్తున్నారు. నిన్న భట్టి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని రేవంత్ రెడ్డిపై అసమ్మతి రాజేశారు.

బీజేపీ నేతలు డీకే అరుణ, రాజగోపాల్ రెడ్డిలతో కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడి ఎలాగూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో చేరుతారు కాబట్టి అతడితోటి కాంగ్రెస్ సీనియర్స్ కూడా చేర్పించాలని చూస్తున్నారు. ఆలోపు కాంగ్రెస్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయాలని చూస్తున్నారంట.. కాంగ్రెస్ సీనియర్ల ప్లాన్ తెలిసి రేవంత్ రెడ్డి సహా అధిష్టానం ఈ విషయంలో స్టిక్ట్ గా ఉండాలని.. గెలవని సీనియర్లు పోతేనే పార్టీకి పట్టిన దరిద్ర పోతుందని గమ్మున ఉంటున్నట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.