Begin typing your search above and press return to search.
దమ్మాయిగూడ కేసు : భార్య సంసారానికి పనికిరావని చెప్పడంతో .. . చిన్నారులపై ..
By: Tupaki Desk | 13 July 2021 5:55 AM GMTహైదరాబాద్ , దమ్మాయిగూడలో చిన్నారులపై లైంగికదాడి కేసు దర్యాప్తులో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంసారానికి పనికిరావంటూ భార్య హేళన చేసిందని , ఆ కోపంతోనే అభిరామ్ దాస్ మహిళలపై కోపం పెంచుకున్నట్టు పోలీసుల విచారణలో చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఒడిషాకు చెందిన అభిరామ్ దాస్ అలియాస్ అభి 12 ఏండ్ల క్రితం భార్యతో కలిసి నగరానికి వచ్చాడు. అయితే ఎనిమిదేళ్ల కిందటే అభిరామ్‌ను అతని భార్య వదిలేసింది. దీంతో అతడు కీసర బండ్లగూడలోని ఓ గదిలో అద్దెకుంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన అభిరామ్, తన కామవాంఛ తీర్చుకునేందుకు చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు.
దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీకి చెందిన ఓ మూడున్నర ఏళ్ల బాలికను జూలై 4వ తేదీన కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గాలిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఆ బాలిక దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ వాటర్ ట్యాంక్ వద్ద కనిపించచింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, చిన్నారిపై లైంగికదాడికి జరిగినట్లు గుర్తించారు.
అయితే ఇదే వ్యక్తి జూలై 9వ తేదీన దుమ్మాయిగూడు ప్రాంతంలోని కిరాణ షాప్ కు వచ్చి అక్కడే ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. ఇది గమనించిన బాలిక తల్లి అతని చర్యను ప్రతిఘటించింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై చిన్నారి తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అతడు ఎరుపు రంగు టీషర్టు, నల్ల మాస్క్ ధరించి ఉన్నాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. చివరకు నాగారం అటవీ ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా చిన్నారి పై లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. కేసు విచారణలో భాగంగా పోలీసుల అదుపులో ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్.. నుదుటిపై తుపాకీ పెట్టి తనను కాల్చేయాలంటూ పోలీసులను వేడుకోవడం గమనార్హం.