Begin typing your search above and press return to search.
యాగంపై డిప్యూటీ సీఎం మనసులో మాట
By: Tupaki Desk | 29 Dec 2015 10:00 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఐదు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగం తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఆధ్యాత్మికవాదులు, అటు లౌకికవాదులు ఈ యాగంపై తమదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఒకింత గమ్మునే ఉన్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాత్రం విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా పార్టీ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం దామోదర మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చండీమాత అనుగ్రహం కోసం కేసీఆర్ యాగంచేస్తున్నప్పటికీ చండీమాత మాత్రం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆరోపించారు. యాగశాలలో మంటలంటుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. యాగానికి దేశప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జ్జీని ఆహ్వానించారని.. ప్రణబ్ స్వతహాగా చండీమాత భక్తుడైనప్పటికీ అమ్మవారు దర్శనమివ్వకపోవడంతోనే వెనుతిరిగారంటేనే అర్థం చేసుకోవచ్చన్నారు. యాగం లాగా భవిష్యత్తులో టీఆర్ ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా అగ్నికి ఆహుతై కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఏమీ చేయట్లేదని ఆరోపించిన దామోదర...భారతీయుల ఆత్మగౌరవం - ఆత్మస్థ్తైర్యం - ఐక్యత - సమైక్యత అనే అంశాలపై స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతాల ప్రకారం ముందుకుపోతుందని ఉద్ఘాటించారు.