Begin typing your search above and press return to search.
తెలంగాణలో జోరుగా ఆపరేషన్ కమలం.. తాజాగా టీపీసీసీ వికెట్
By: Tupaki Desk | 22 Aug 2022 1:30 PM GMTమనుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. తెలంగాణలో అధికార పార్టీకి తామే అసలుసిసలు ప్రత్యామ్నాయమని చెప్పేందుకు తహతహలాడుతోంది కమలం పార్టీ.
అందులో భాగంగా చేరికల కమిటీని ఏర్పాటు చేసి.. వివిధ పార్టీల నుంచి నేతల్ని పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టింది. ఇందులో భాగంగా ఏ పార్టీకి చెందిన నేతను ఎలా టార్గెట్ చేయాలి.. పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా ఆపరేషన్ కమలం ప్రాజెక్టు జోరు మరింత పెంచాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ముఖ్యుడి వికెట్ పడింది. టీపీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ దామోదర్ రెడ్డి తాజాగా పార్టీని వీడారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదని.. తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించటం లేదని పేర్కొంటూ ఆయన తన పదవికి .. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరనున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే.
కమలం పార్టీలో చేరే విషయాన్ని తెలిపిన గంటల వ్యవధిలోనే ఆయన పార్టీలోని తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దామోదర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొనటం గమనార్హం. పార్టీని వీడిపోతానని ప్రకటించిన తర్వాత బహిష్కరణ వేటు వేయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అన్నది క్వశ్చన్.