Begin typing your search above and press return to search.

మీడియాపై అంత ఫైర్ ఎందుకు 'మాజీ' గారు?

By:  Tupaki Desk   |   2 Jun 2016 10:12 AM GMT
మీడియాపై అంత ఫైర్ ఎందుకు మాజీ గారు?
X
మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ మీడియాపై ఊగిపోయారు. మెద‌క్ జిల్లా మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం పెంచాలంటూ చేప‌ట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న వివాదాస్ప‌ద‌మైంది. నిర్వాసితులకు పరిహారం పెంచేందుకు పోరాడుతామని మాజీ మంత్రులు గీతారెడ్డి - సునీతా ల‌క్ష్మారెడ్డి దైర్యం నింపారు. అనంత‌రం దామోదర రాజనర్సింహ ప్ర‌సంగం సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న వివాదాస్ప‌ద‌మైంది.

రాజనర్సింహ ప్రసంగం మొదలు పెడుతూనే #అరే మీకేమన్న ఉన్నదా? అసల్ గింత లొల్లి జరుగుతుంటే మీడియా లం..కొడుకులు ఒక్కడన్న పేపర్లల రాస్తున్నడా?. టీవీల సూపిస్తున్నడా? మొదాల్ గీళ్ల.. పగులగొడ్తే అంత సాఫ్ అయితది. ఈ నా కొడుకులు సర్కారుకు అమ్ముడు పోయిండ్రు. వీళ్లను ముందుగాల తన్నాలె# అంటూ బూతులు తిట్టారు. మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నరు సార్? మీ ప్రభుత్వంలో కూడా మేం వార్తలు రాయలేదా? అప్పుడు కూడా అమ్ముడుపోయామా. అనవసరంగా నిందలు వేయడం సరికాదు# అని పాత్రికేయులు అన‌డంతో రెచ్చిపోయిన రాజనర్సింహ ఇంకా ఏం జూస్తున్నర్రా.. తన్నుండ్రి... ఆ నా కొడుకులను అనటంతో దాడులు పెరిగాయి. దీంతో జ‌రిగిన దాడిలో వీ6 చానల్ - సిటీచానల్ - ఏబీఎన్ చానల్ - టీవీ9 ప్రతినిధి - ఈ టీవీ కెమెరామెన్ - 99 టీవీ చానల్ కెమెరామెన్ - సూర్య దినపత్రిక విలేకరి గాయపడ్డారు. టీవీ చానల్ విలేకరులకు పెద్ద కెమెరాలు - ఒక హ్యాండ్ కెమెరా - ఫొటో కెమెరాలు ధ్వంసమయ్యాయి. దాడిపై పోలీసులకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేయించిన రాజనర్సింహ వైఖరిని జ‌ర్న‌లిస్టులు ఖండించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుని, రాజకీయాల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వ‌త‌హాగా దూకుడు మ‌న‌స్త‌త్వం అయిన దామోద‌ర అన‌వ‌స‌రంగా విలేక‌రుల‌తో పెట్టుకున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.