Begin typing your search above and press return to search.
తెలంగాణ ‘కల్వకుంట్ల’ రాజ్యంగా మారిందట
By: Tupaki Desk | 15 Feb 2016 4:45 PM GMTతెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా గళం విప్పుతున్నారు. తెలంగాణ అధికారపక్షం అప్రతిహతంగా దూసుకెళుతున్న నేపథ్యంలో విపక్షాలన్నీ బేలగా చూస్తున్న వేళ.. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో లబ్థి పొందుతున్నది కేసీఆర్ ఫ్యామిలీనే తప్పించి మరొకరు కాదని తేల్చి చెబుతున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ.
తాజాగా మెదక్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో దామోదర ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఫ్యామిలీపై విమర్శలతో మండిపడ్డారు. తెలంగాణ కోసం యువత ప్రాణాలు ఆర్పిస్తే.. కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం పదవుల్ని అనుభవిస్తోందని మండిపడ్డారు. తెలంగాణను కల్వకుంట్ల రాజ్యంగా కేసీఆర్ మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. లేకుంటే మెడ కోసుకుంటానన్న ఆయన.. అధికారం రాగానే తానిచ్చిన మాటను మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తన కొడుక్కి ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని.. కూతురికి కేంద్రమంత్రి పదవిని అప్పగిస్తారని జోస్యం చెప్పారు. కొద్దికాలంగా మీడియాలో పెద్దగా కనిపించని దామోదర.. తన పదునైన వ్యాఖ్యలతో తాజాగా తెర మీదకు వచ్చారు. ఇలా తరచూ కాంగ్రెస్ నేతలు కనిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.