Begin typing your search above and press return to search.
గోషా మహల్ గోదాలో 'హైదరాబాద్ బ్రదర్స్'!
By: Tupaki Desk | 11 Sep 2018 12:16 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఇటు టీఆర్ ఎస్ తో పాటు అటు కాంగ్రెస్ - టీడీపీలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ నుంచి రాబోయే ఎన్నికల్లో గెలుపునకు తహతహలాడుతోన్న కాంగ్రెస్ వరకు అసమ్మతి సెగలు - అసంతృప్తులతో సతమతమవుతున్నాయి. తమకు టికెట్ దక్కలేదని కొందరు - తమకు పట్టున్న స్థానాల్లో టికెట్ కేటాయించలేదని మరికొందరు ...ఇలా రకరకాల కారణాలతో టికెట్ ఆశావహులు పార్టీలపై అలకబూనారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపులు...జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు ఏర్పడనుందని సమాచారం. అటువంటి ఆసక్తికర నియోజకవర్గాల్లో గోషా మహల్ ఒకటి. మాజీ కాంగ్రెస్ నేత - ప్రస్తుత టీఆర్ ఎస్ నేత దానం నాగేందర్....కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ల మధ్య గోషా మహల్ లో రసవత్తరపోరు జరగబోతుండడమే అందుకు కారణం.
ముఖేష్, దానంలు ఇద్దరూ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరినీ హైదరాబాద్ బ్రదర్స్ అని పిలుస్తారు. అయితే, తాజాగా దానం కారెక్కడంతో ...ఆయనకు దాదాపుగా గోషా మహల్ స్థానం ఖాయం అయిందని టాక్ వస్తోంది. ఇక, ముఖేష్ కూడా కాంగ్రెస్ నుంచి గోషా మహల్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో, ఈ ఇద్దరు మిత్రుల మధ్య పోటీ తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక, ఇదే స్థానంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా బరిలోకి దిగబోతున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన ...ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నారట. దీంతో, గోషామహల్ లో ఆసక్తికరమైన త్రిముఖ పోరు ఏర్పడిందని టాక్. ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.