Begin typing your search above and press return to search.
కేటీఆర్ తో దానం భేటీ: టార్గెట్ ఎమ్మెల్సీ!
By: Tupaki Desk | 20 Sep 2016 9:06 AM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో మాజీ మంత్రి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగి ఈ భేటీ జరిగింది. రాజకీయ ప్రాధాన్యత అంశాలు చర్చకు రాలేదని దానం తెలిపినప్పటికీ ఈ సమావేశం వెనుక ఆసక్తికర అంశాలు ఉన్నట్లు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం కుదుర్చుకొని, చివరి సమయంలో విరమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వంటి ముఖ్యులు హాజరై హైదరాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల శిక్షణా సమావేశం జరుగుతున్న సమయంలో దానంనాగేందర్ కేటీఆర్ ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. జాతీయ - రాష్ట్రస్థాయి నేతలందరూ హాజరైన సమయంలో దానం కూల్ గా మంత్రి కేటీఆర్ తో భేటీ అవడం ఆసక్తికరం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం దానం కోరినట్టు తెలిసింది. మరోవైపు దానం సోదరుడికి చెందని వ్యాపార వ్యవహారాల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించుకునేందుకే కేటీఆర్ తో ఆయన సమావేశం అయ్యారని తెలుస్తోంది.