Begin typing your search above and press return to search.

'ని'దానం నాగేందర్..!

By:  Tupaki Desk   |   11 Sep 2018 1:30 AM GMT
నిదానం నాగేందర్..!
X
దానం నాగేందర్‌.......కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో హైదారబాద్‌ కాంగ్రెస్ రాజకీయాలలో "చేయి" తిప్పిన మనిషి. అయితే తన కప్పగంతుల రాజకీయాలతో ప్రజలలోనే కాదు రాజకీయ పార్టీలో కూడా విశ్వసనీయత కోల్పోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలలో దానం నాగేందర్ చురుకుగా పాల్గున్నారు. దీంతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానం నాగేందర్‌ కు అధిక ప్రధాన్యం ఇచ్చురు. మంత్రివర్గంలో చోటు కల్పించారు. అంతే కాదు హైదారబాద్ రాజకీయాలలో దానం నాగేందర్‌ను కీలక వ్యక్తిగా మలిచారు. వై.ఎస్. అండ - తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత - వై.ఎస్. నాయకత్వం దానం నాగేందర్‌ ను అంతేత్తుకు పెంచాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి దానం నాగేందర్‌ కు టిక్కెట్టు దొరకలేదు. దీంతో ఆయన తెలుగదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటి చేసారు. ఈ ఎన్నికలలో దానం నాగేందర్ గెలిచారు. తెలగుదేశం పార్టీ ఓడింది. దీంతో దానం నాగేందర్ పరిస్థితి తారుమారు అయింది.

దానం నాగేందర్ గెలిచారు గాని తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌ లో చేరారు. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామ చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. ఈ దశలో కాంగ్రెస్ అభ్యర్దిగా దానం నాగేందర్ మళ్లి పోటి చేసారు. కాని ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ పరిస్థితి మళ్లి మొదటికి వచ్చింది. ఇదంతా పాత కథ. తెలంగాణ విడిపోవడంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్లు కాంగ్రెస్‌ లో ఉన్న దానం కారు ఎక్కారు. వచ్చే ఎన్నికలలో తనకు సీటు గ్యారెంటీ అని ఆశ పడ్డారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆలోచన మాత్రం వేరేల ఉంది. ఈ ఎన్నికలలో దానం నాగేందర్‌ కు టిక్కెట్టు దక్కె అవకాశాలు కనిపించటం లేదు. ఈ విషయం తెల్సుకున్న దానం నాగేందర్ మళ్లి సొంత గూడు కాంగ్రెస్‌ కు చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. చీటికిమాటికి పార్టీలు మారిపోవడంతో దానం నాగేందర్‌ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని రాజకీయ పండితులు అంటున్నారు. రాజకీయ ఎదుగుదల కోరుకుంటున్న దానం నాగేందర్ కాసింత నిదానం పాటించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.