Begin typing your search above and press return to search.
అందుకే దానం కండువా మారలేదంట
By: Tupaki Desk | 7 Dec 2015 3:48 AM GMTగురువారం రాత్రిపూట టీఆర్ ఆర్ ఎస్ ముఖ్యనేతలతో రహస్యంగా భేటీ అయిన సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఇష్యూ బయటకు వచ్చేసిన తర్వాత.. ఆయన జంపింగ్ దాదాపుగా ఖాయమైపోయిందంటూ వార్తలు వచ్చాయి. హస్తం వదిలేసి కారు ఎక్కటం పక్కా అన్న మాట వినిపించింది. భుజాన ఉన్న కండువా రంగు మారటం సాంకేతికం మాత్రమేనంటూ అంచనాలు వినిపించాయి. మరికాసేపట్లో దానం పార్టీ మారనున్నారన్న మాట వినిపించినప్పటికీ.. శుక్రవారం మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం సీన్ మొత్తంగా మారింది.
తనకు అండగా నిలిచే ఛోటా నేతలు.. కార్యకర్తలతో భేటీ అయిన దానం నాగేందర్.. మెడలో కాంగ్రెస్ కండువా వేసుకొని కనిపించటంతో లెక్కలో ఏదో తేడా జరిగిందన్న విషయం అర్థమైంది. దీనికి తగ్గట్లే.. తాను పార్టీ మారనంటూ దానం స్పష్టం చేయటం.. దానికి తగ్గట్లే.. దానం పార్టీ మారే ఛాన్సే లేదంటూ కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెప్పినట్లుగా చెప్పటం కనిపించింది.
రాత్రికి కారు ఎక్కటం పక్కా అని తేలిన దానం విషయంలో పొద్దునకు ఏం జరిగిందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. దీని వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. దానం కారు ఎక్కేందుకు ఓకే అయిపోయిందని.. అయితే.. దానంకు గులాబీ కుండువా కప్పేందుకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో లేరని.. ఆయన బదులుగా వేరే వారు కండువా కప్పుతారన్న మాటకు దానం షాకయ్యారట.
తనలాంటి నేత పార్టీలోకి వస్తుంటే.. కేసీఆర్ కాకుండా.. మరెవరో తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. మెడలో గులాబీ కండువా వేయటం ఏమిటంటూ ఫీలైన ఆయన.. వెంటనే డీల్ విషయంలో వెనక్కి తగ్గారట. ఈ కారణంతోనే దానం కండువా మారలేదని చెబుతున్నారు. గులాబీ పార్టీలో ఎంట్రీనే ఇలా ఉంటే.. తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆలోచించే దానం వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.