Begin typing your search above and press return to search.
పవర్ చేజారాక ఆ మాటలెందుకులే దానం
By: Tupaki Desk | 7 Sep 2015 12:01 PM GMTచేతిలో పవర్ ఉన్నప్పుడు చాలానే చేసేసినట్లు.. విశాల హృదయంతో చేసినట్లు చెప్పుకోవటం మాజీలకు అలవాటే. కాంగ్రెస్ పార్టీ సుద్దపూస లాంటిదని.. తాము అధికారంలో ఉన్నప్పుడు న్యాయం.. ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించినట్లుగా చెప్పుకోవటం తెలంగాణ కాంగ్రెస్ నేతలకే చెల్లింది. భారత ప్రజాస్వామ్యంలో అన్ని అవలక్షణాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ అన్న విషయం రాజకీయం తెలిసిన ప్రతిఒక్కరికి తెలిసిందే.
అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు.. తమను తాము గొప్పగా చెప్పుకోవటం కాస్తంత కామెడీనే. తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చేసిన దాడిపై మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే తీరులో వ్యవహరించి ఉంటే తెలంగాణలో ఒక్క పార్టీ కూడా ఉండేది కాదని చెప్పిన ఆయన.. తాము ఎంతో బుద్ధిగా పాలన చేసినట్లుగా చెప్పుకోవటం విశేషం.
నిజమే.. ఇతర పార్టీ నేతల్ని తర్వాత.. సొంత పార్టీ నేతలే ఒకరినొకరు బాహాటంగా కొట్టుకోవటం.. వేరే పార్టీ ఎమ్మెల్యేలపై రౌడీయిజం చేయటం లాంటివే తెలీదన్నట్లుగా మాట్లాడటం దానంకే చెల్లింది. ఇక.. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని వలేసి పార్టీలోకి లాగేయటం మొదలు.. ఆపరేషన్ ఆకర్ష్ లాంటి స్కీములన్నీ కాంగ్రెస్ మానసపుత్రికలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
పాపాలన్నీ కాంగ్రెస్ మాత్రమే చేసేస్తుందని.. మిగిలిన పార్టీలన్నీ మంచివని చెప్పేయటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కాకుంటే.. తమ హయాంలో చేసిన తప్పులకు ఇప్పటికి క్షమాఫణలు చెప్పకుండా.. తమ పాలన గురించి గొప్పలు చెప్పేయటం చూస్తేనే కడిగేయాలనిపిస్తుంది. పవర్ లో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడేదో తాము ఉత్తములం అన్నట్లుగా గొప్పలు చెప్పుకోవటం దానం లాంటి నేతలకు చెల్లిందని చెప్పక తప్పదు.