Begin typing your search above and press return to search.
రిపబ్లిక్ డే ‘జగనన్న’ డీజే పాటలకు స్టెప్పులు!
By: Tupaki Desk | 26 Jan 2021 3:24 PM GMTగణతంత్ర దినోత్సవం వేళ సాధారణంగా జాతీయ భావాలు ఉప్పొంగేలా పాటలు పెడుతారు. ‘వందేమాతరం’, జనగణమన అనే పాటలను ఆలపిస్తారు.. పెడుతారు. అయితే గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గణతంత్ర వేడుకలు వివాదాస్పదమయ్యాయి. దేశభక్తి పాటలకు బదులు జగనన్న పాటలకు విద్యార్థులు డ్యాన్సులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. విద్యార్థుల నృత్యాలు విమర్శలకు దారితీసింది.
రిపబ్లిక్ డే వేడుకల్లో దేశభక్తి పాటలు వినిపించాల్సిన చోట జగనన్న పాటలు పెట్టి డ్యాన్సులు చేయడం చర్చనీయాంశమైంది. విద్యార్థినుల డ్యాన్సులు వివాదాస్పదమైంది.
ఇన్ చార్జి వైస్ చాన్సలర్ సమక్షంలోనే విద్యార్థులు ఈ ప్రదర్శన చేయడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు.వేడుకలకు హాజరైన అతిథులు - సీనియర్ సిటిజన్లు ఈ ఘటనతో అవాక్కయ్యారు.
కాగా ఈ డ్యాన్సులపై పలు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ చార్జి వీసీపై మండిపడ్డారు.