Begin typing your search above and press return to search.

కలిసి డ్యాన్స్ చేయలేదని.. కాల్చి చంపాడు!

By:  Tupaki Desk   |   5 Dec 2016 4:56 AM GMT
కలిసి డ్యాన్స్ చేయలేదని.. కాల్చి చంపాడు!
X
కోరిక‌కు మూర్ఖ‌త్వం తోడ‌యితే ఎలా ఉంటుంద‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. త‌న‌తో క‌లిసి డాన్స్ చేయాల‌న్న కోరిక‌ను తిర‌స్క‌రించినందుకు ఆ డ్యాన్స‌ర్ ను అంద‌రిలోనే కాల్చి చంపాడు. పెళ్లి వేడుక‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో అంతా షాక్‌కు లోన‌య్యారు. పంజాబ్‌ లో జ‌రిగిన ఈ ఉదంతం క‌ల‌క‌లం రేకెత్తించింది. భ‌టిండాలో గ‌త‌ మౌర్‌ లోని ఓ స్థానిక కమిషన్ ఏజెంట్ కొడుకు వివాహ వేడుక సందర్భంగా ఈ దారుణం జరిగిందని - మృతురాలిని కుల్విందర్ కౌర్ (22)గా గుర్తించామని జిల్లా ఏఎస్పీ తెలిపారు. నిందితుడు బిల్లాను అరెస్ట్ చేసి అతని నుంచి .21 బోర్ గన్‌ ను స్వాధీనం చేసుకొన్నామని పేర్కొనారు.

వివాహ వేడుక సందర్భంగా పెళ్లి కొడుకు స్నేహితులు అతిగా మద్యం సేవించారు. తాగిన మత్తులో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ క్రమంలో వేదిక మీద డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేయడానికి కొందరు ప్రయత్నించారు. అయితే బృందంలోని వరుడి స్నేహితులను డ్యాన్స్ గ్రూప్ సభ్యులు అడ్డుకొన్నారు. దాంతో ఆగ్రహించిన బిల్లా తన వద్ద ఉన్న .12 బోర్ గన్‌ తో కుల్విందర్ కౌర్ తలలోకి అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు అని పోలీసులు తెలిపారు. నిందితుడు కాల్పులు జరుపగా వేదికపైనే డ్యాన్సర్ కుప్పకూలిందని, చికిత్స కోసం దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఆమె మరణించిదని భటిండా డీఎస్పీ దేవిందర్‌ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో బిల్లాతోపాటు నలుగురిపై హత్యానేరం కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామన్నారు.