Begin typing your search above and press return to search.
జైల్లో జైలర్ స్టెప్పులు అదిరాయి
By: Tupaki Desk | 12 Feb 2016 10:05 PM ISTప్రభుత్వ అధికారులంటే విధులపై ఎంత తక్కువ శ్రద్ధ చూపుతూ తమ ఇంట్రస్ట్‌లు, షోకుల విషయంలో క్రేజీగా ఉంటారనేందుకు మరో ఉదాహరణ ఇది. విధులు నిర్వహించాల్సింది పోయి ఏకంగా జైలు వేదికగా ఓ జైలర్ డ్యాన్స్ లతో ధూం..ధాం చేశాడు. తద్వారా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ క్రేజీ జైలర్ కొలువు చేసేది తమిళనాడులోని సేలంలో. ఆయనగారి పేరు శంకరన్.
ఈ ఘనత వహించిన శంకరన్ గారు జైల్లో స్టెప్పులు వేశారు. తన పనిచేసే జైల్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఆడేశారు. ఇదంతా తన యూనిఫామ్ లోనే చేశారు. జైలర్ కాబట్టి ఈయనగారి జోష్ చూసి తోటి సిబ్బంది, ఖైదీలు కూడా డ్యాన్స్ చేసేశారు. అయితే ఈ సంబరం ఇక్కడితోనే ఆపేయకుండా...వీడియో తీసుకొని వాట్సప్ లో పోస్ట్ చేసేశారు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆగదు కదా. అది పెద్ద వైరల్ అయిపోయింది. అలా అలా ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి చేరిపోయింది. అసలే డ్యాన్స్ లు, అందులో జైలు వేదికగా, పైగా యూనిఫామ్ లో దీంతో శంకరన్ గారి పదవి ఊడిపోయింది. కొసమెరుపు ఏంటంటే... ఖైదీలతో మసాజ్ చేయించుకునే అలవాటు కూడా ఈ జైలర్ గారికి ఉందని సస్పెన్షన్ తర్వాత తేలింది.