Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు డేంజర్ బెల్స్ ?
By: Tupaki Desk | 20 Sep 2021 6:35 AM GMTతాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికలు తెలుగుదేశంపార్టీకి ఏమోకానీ చంద్రబాబునాయుడుకి మాత్రం డేంజర్ బెల్స్ అనే చెప్పాలి. ఎందుకంటే జడ్పీటీసీలను చూస్తే దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్లే. ఇక ఎంపీటీసీలను తీసుకుంటే 90 శాతం అధికార వైసీపీ ఖాతాలో పడిపోయాయి. శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లావరకు ఎన్నికలు దాదాపు ఏకపక్షంగానే జరిగిపోయింది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినా కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్ధులు పార్టీ తరపునే పోటీచేశారు. దీనికి ఆధారం ఏమిటంటే బ్యాలెట్ పేపర్లో టీడీపీ సింబల్ ఉండటమే.
అంటే టీడీపీ పోటీలో ఉన్నాకూడా జనాలు ఆ పార్టీ అభ్యర్ధులను పట్టించుకోలేదన్న విషయం అర్ధమైపోతోంది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఫలితాలు వరుసబెట్టి అధికారపార్టీకి ఏకపక్షంగా వస్తోందంటే ప్రతిపక్షాలకు ఇబ్బందనే చెప్పాలి. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ సంగతిని పక్కనపెట్టేసినా టీడీపీకి మాత్రం పెద్ద దెబ్బనే చెప్పాలి. మిగిలిన పార్టీలకు ఎలాగూ పెద్దగా బేస్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ పరిస్ధితి అలాకాదు.
మొత్తం 13 జిల్లాల్లోను గ్రామ గ్రామాన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీపై క్యాడర్ కున్న కమిట్మెంట్ నేతలకు లేకపోవటమే. చాలామంది ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నపుడే కాదు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా గొడవలు పడుతునే ఉన్నారు. తాజాగా అనంతపురంలోని నేతల మధ్య బయటపడి కంటిన్యు అవుతున్న విభేదాలే ఉదాహరణ. అధికారంలో ఉన్నపుడు చాలా కారణాల వల్ల ఆధిపత్య గొడవలు జగటం మామూలే.
కానీ విచిత్రం ఏమిటంటే అవే ఆధిపత్య గొడవలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరింతగా పెరిగిపోవటమే. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే పుట్టి పెరిగిన చంద్రగిరి నియజకవర్గంతో పాటు గడచిన 35 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా టీడీపీకి బాగా దెబ్బపడిపోయింది. కుప్పం నియోజకవర్గంలోని అన్నీ జడ్పీటీసీలతో పాటు 95 శాతం ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకోవటం చంద్రబాబుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోను టీడీపీదే ఏకపక్ష ఫలితంగా ఉండేది. నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీలనూ వైసీపీ గెలవటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే 66 ఎంపీటీసీల్లో 63 వైసీపీనే గెలిచింది.
మొదటిసారిగా టీడీపీకి ఇపుడే తలబొప్పి కట్టింది. టీడీపీకి దెబ్బపడిందంటే అది డైరెక్టుగా చంద్రబాబు మీదపడిందనే చెప్పాలి. ఇప్పటివరకు టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న కుప్పం కోటకు బీటలు పడిందనే విషయం చంద్రబాబుకు అర్ధమైపోయుంటుంది. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీని వదిలిపెట్టేసి వైసీపీలో చేరిపోయారు. కుప్పంలో చంద్రబాబు పట్టుజారిపోతోందన్నది వాస్తవం. ఇప్పుడు గనుక వెంటనే మేల్కొనకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎదురీదాల్సిందే అనటంలో సందేహంలేదు.