Begin typing your search above and press return to search.
తెలంగాణకు డేంజర్ బెల్స్..రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన!
By: Tupaki Desk | 4 April 2020 10:26 AM GMTప్రస్తుతం తెలంగాణ లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 229కేసులు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే త్వరగా చనిపోతుంది. దాని ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్న వేళ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ షాకింగ్ విషయం వెల్లడించింది. రానున్న మూడ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
కొమోరిన్ నుంచి రాయలసీమ వరకూ 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్ తో పాటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.
కరోనా వైరస్ అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉండలేదని ఇంతవరకూ నిపుణులు చెప్పిన మాటలతో ప్రజలు కాస్తో కూస్తో ధైర్యంగా ఉంటున్నారు. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై.. భాగ్యనగరమంతా చల్లబడింది. ఇలాంటి సమయంలో ఎక్కడో ఒక చోట కరోనా లక్షణాలున్నవారు గనుక బయటికొస్తే వారిద్వారా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. శుక్రవారం వరకూ భగభగమన్న ఎండలు, శనివారం అస్సలు కనిపించలేదు. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపధ్యంలో వర్షాలు పడితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.