Begin typing your search above and press return to search.
అమెరికాలో తగ్గుతున్న మరణాల సంఖ్య ...20 లక్షలకి చేరిన కేసులు !
By: Tupaki Desk | 8 Jun 2020 5:30 AM GMTమహమ్మారి వైరస్ పుట్టింది చైనాలో అయినా సరే ఎక్కువగా నష్టపోయింది మాత్రం అమెరికానే. దేశ వ్యాప్తంగా అక్కడ నమోదు అయిన పాజిటివ్ కేసులు ఆందోళన కలిగించాయి. ఊహించని విధంగా వైరస్ కేసులు నమోదు కావడం, ప్రతీ రోజు కూడా వేల సంఖ్యలో మరణాలు సంభవించడంతో అమెరికన్లు భయంతో వణికిపోయారు. అయితే, ఇప్పుడిప్పుడే అక్కడ మరణాలు తగ్గినా.. పాజిటివ్ కేసులు భారీగానే నమోదవతున్నాయి.
ఇప్పటివరకు అగ్ర రాజ్యంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. అలాగే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలను దాటేశాయి. 4లక్షల మందిపైగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 1.12 లక్షల మంది కరోనాకు బలి కాగా.. ఐరోపాలో 1.75 లక్షలకు పైనే మరణాలు సంభవించాయి. మృతదేహాలకు పరీక్షలు నిర్వహించి ఉంటే మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక, బ్రెజిల్ లో 24గంటల్లో 26,380 కేసులు, 867 మరణాలు నమోదయ్యాయి. పాకిస్థాన్ లో కేసులు లక్షకు చేరువయ్యాయి. కొత్తగా 4,960 మందికి కరోనా సోకింది. మరో 67 మంది మృతిచెందగా మొత్తం మరణాలు 2,002 అయ్యాయి.
చైనాలో వైరస్ లక్షణాలు కనిపించకుండా వ్యాపిస్తోంది. తాజాగా 11 కేసులు నమోదవగా వాటిలో ఐదింటిలో లక్షణాలు లేవు. ఇప్పటివరకు ఇలాంటివి 236 కేసులు తేలగా.. 154 కేసులు వైరస్ జన్మస్థానమైన వూహాన్ లోనే రికార్డయ్యాయి. ఇక భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 256611కి చేరింది. అలాగే.. మొత్తం మరణాల సంఖ్య 7133కి చేరింది. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు. ప్రస్తుతం ఇండియాలో... కొత్తగా 4802 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసులు 124094గా ఉన్నాయి. అలాగే... మరణాల రేటు ప్రతి వెయ్యి మంది కరోనా సోకిన వారిలో 28 మంది చనిపోతున్నారు.