Begin typing your search above and press return to search.
ఒక్క సిగరెట్ తో ముగ్గురికి కరోనా ..ఎక్కడంటే !
By: Tupaki Desk | 28 May 2020 8:10 AM GMTదేశంలో, మహమ్మారి రోజురోజుకి వేగంగా విజృంభిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఏ మాత్రం భయం, బెరుకు కనిపించడంలేదు. ఎవరికీ వారు తమకి వ్యాధి సోకదులే అని అనుకుంటూ..యథేచ్ఛగా ..తిరుగుతూ , వైరస్ నిబంధనలను తుంగలో తోక్కేస్తున్నారు. జాగ్రత్తలు అసలు పాటించడం లేదు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ మధ్య ఎక్కువ శాతం మంది వైరస్ భారినపడుతున్నారు. తాజాగా ఓ సిగరెట్ షేర్ చేసుకోవడం వల్ల ముగ్గురు వైరస్ భారిన పడ్డారు.
సిగరెట్టు షేరింగ్ వల్ల తెలంగాణలోని షాద్ నగర్ లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. షాద్ నగర్ లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన ముగ్గురు యువకులు ఒక్కటే సిగరెట్ ను షేర్ చేసుకున్నారు. దాంతో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. అయితే కరోనా సోకినా విషయం అతనికి ముందుగా తెలీయదు. దీంతో అతనితో సిగరెట్ షేర్ చేసుకున్న ఇద్దరికీ కరోనా సోకింది.
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన హైదరాబాదులోని జియాగుడాకు చెందిన ఓ యువకుడు షాద్ నగర్ లో అంత్యక్రియలకు హాజరయ్యాడు. అక్కడ అతను మిగతా ఇద్దరితో సిగరెట్ షేర్ చేసుకున్నాడు. అదే కొంప ముంచింది. ఈ మూడు కేసులతో షాద్ నగర్ లో కరోనా సంఖ్య 7 కు చేరింది. కాగా, తెలంగాణలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 108 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,099కు చేరింది. జీహెచ్ ఎంసీ పరిధిలోనే 76 కేసులు నమోదు అయ్యాయి.