Begin typing your search above and press return to search.

అమెరికాలో మళ్లీ కల్లోలం: ఒక్కరోజే 34,700 కేసులు

By:  Tupaki Desk   |   26 Jun 2020 4:15 AM GMT
అమెరికాలో మళ్లీ కల్లోలం: ఒక్కరోజే 34,700 కేసులు
X
మళ్లీ వైరస్ విజృంభణ మొదలైంది. కొన్నాళ్ల పాటు వైరస్ ఉధృతి తగ్గగా ఇప్పుడు మళ్లీ తిరగదోడుతోంది. ఇప్పటికే అమెరికాలో 2.3 మిలియన్లకు పైగా కేసులు నమోదవగా 1,21,000 మందికి పైగా మరణించారు. ఇప్పుడు ఒక్కరోజే 34,700 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త రికార్డులు సృష్టిస్తూ కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని జాన్స్‌ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. నాటి నుంచి ఇప్పటివరకు ఏప్రిల్‌లో ఒకే రోజులో 36,400 కేసులు నమోదు కాగా తర్వాత ఇదే అత్యధికం.

ఇప్పటివరకు వైరస్ న్యూయార్క్‌, న్యూజెర్సీలను వణికించింది. అక్కడ తగ్గుముఖం పట్టిన వైరస్ తాజాగా అరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిస్సిపి, నెవడా, టెక్సాస్, ఓక్లహామా తదితర నగరాల్లో ప్రతాపం చూపిస్తోంది. టెక్సాస్‌లో రెండు వారాల్లోనే కేసులు మూడు రెట్లు అత్యధికంగా కేసులు పెరిగాయి. హ్యూస్టన్‌లో పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. అక్కడ ఐసీయూలు నిండిపోయి.. ప్రభుత్వ ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.

నార్త్ కరోలిననా, దక్షిణ కరోలినా హాస్పిటలైజేషన్ రికార్డులను బద్దలు కొట్టగా మరికొన్ని రాష్ట్రాలు అదే కోవలో చేరుతున్నాయి. వైరస్ మరింత తీవ్రమవుతుందని హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ సిస్టమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ బూమ్ తెలిపారు. అమెరికా మరణాల సంఖ్య 1,22,000కు చేరుకోగా అక్టోబర్ 1 నాటికి దాదాపు 1,80,000 మరణాలు నమోదవ్వచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.