Begin typing your search above and press return to search.

అమెరికాలో ‘మహమ్మారి తుఫాన్’.. కారణమిదే.?

By:  Tupaki Desk   |   4 July 2020 8:45 AM GMT
అమెరికాలో ‘మహమ్మారి తుఫాన్’.. కారణమిదే.?
X
జూలై 4.. అంటే నేడు.. అమెరికా స్వాతంత్ర్యం దినోత్సవం. అక్కడ జాతీయ సెలవు దినం. ఆల్ రెడీ ఈ పండుగ కోసం అమెరికా ప్రజలందరూ వేచిచూస్తున్నారు. పండుగ చేసుకుంటున్నారు. పార్టీలు, పబ్బుల్లో జనాల సందడి ఎక్కువైంది. దాంతోపాటు ఈ జూలై 4 వారాంతం విపరీతమైన పాజిటివ్ కేసులతో అమెరికాలో ‘కరోనా తుఫాను’ వచ్చేసింది. అమెరికాలో మొన్న ఒక్కరోజు 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 40,000 కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ సంఖ్య 52,000 కన్నా ఎక్కువ.దీంతో అమెరికాలో స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల విచ్చలవిడితనంగా కారణంగా కరోనా తుఫాన్ వచ్చిందని బోస్టన్ మెడికల్ సెంటర్‌లో అంటు వ్యాధి వైద్యుడు అభిప్రాయపడ్డాడు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వీకెండ్ కేసులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని, వారాంతంలో తమ ఉత్సవాలను అమెరికన్లు పరిమితం చేయాలని ఆయన కోరుతున్నారు. లేదంటే ఈ వీకెండ్ తో అమెరికాలో కరోనా తుఫాన్ రావడం ఖాయమని అమెరికా అంతటా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు జెట్ స్పీడుతో పెరుగుతుండడంతో అమెరికా రికార్డ్ సృష్టిస్తోంది. సిడిసి అంచనా వేసినట్లు జూలై చివరి నాటికి మరణాలు 149,000 కన్నా ఎక్కువ కావచ్చని చెబుతున్నారు. జూలై 4 స్వాతంత్ర్య వేడుకలతో వారాంతాన్ని జరుపుకునే దిశగా అమెరికన్లు వెళుతుండగా, సగం కంటే ఎక్కువ రాష్ట్రాల గవర్నర్లు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. కేసుల పెరుగుదలతో డజనుకు పైగా రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ తెరవడాన్ని పూర్తిగా నిలిపివేసాయి.

అమెరికాలో మహమ్మారితో ఇప్పటివరకు 129,000 మంది మరణించగా, దేశంలో 2.7 మిలియన్ల మందికి ఇది సోకింది. 36 రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వారాంతం తరువాత రోజుల్లో ఈ సంఖ్య భయానకంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్లోరిడాలో అత్యధికంగా అన్నిఇతర రాష్ట్రాలకన్నా రోజుకు 7000 కొత్త కేసులను నమోదు చేస్తోంది. మునుపు బాగా ప్రబలిన న్యూయార్క్, న్యూజెర్సీ మరియు కనెక్టికట్ సహా ఎనిమిది రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు 14 రోజుల క్వారంటైన్ ను తప్పనిసరి చేశారు. మరోవైపు, కేసుల పెరుగుదలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనానే నిందించారు.ఆ దేశం వల్లే మాకీ దుస్థితి అని ఆడిపోసుకున్నాడు.