Begin typing your search above and press return to search.

60కోట్ల వ్యాక్సిన్ డోసులు బుక్.. అమెరికా ఒప్పందం

By:  Tupaki Desk   |   24 July 2020 9:10 AM GMT
60కోట్ల వ్యాక్సిన్ డోసులు బుక్.. అమెరికా ఒప్పందం
X
కరోనా వైరస్ తో అల్లకల్లోలంగా మారిన అమెరికా దేశం ఆ వ్యాధి విస్తృతిని ఆపలేకున్నా.. దాన్ని కంట్రోల్ చేసే వ్యాక్సిన్ విషయంలో మాత్రం ముందుగానే స్పందించింది. కరోనా వ్యాక్సిన్ ను అందరికంటే ముందుగా తమకే ఇచ్చేలా తయారీలో ముందున్న కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

అమెరికాలో కరోనా కల్లోలం వేళ వ్యాక్సిన్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ పెట్టారు.తాజాగా వ్యాక్సిన్ తయారీలో ముందున్న కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఫైజర్, జియో ఎన్టెక్ ఎస్ఈ సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

మొత్తం 60 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అమెరికాకు ఇచ్చేలా ఈ ఒప్పందం చేసుకోగా.. ముందుగా 10 కోట్ల డోసులు ఇవ్వాలని అందులో కండీషన్ పెట్టుకున్నారు. ఇలా ప్రపంచంలో వ్యాక్సిన్ రాకముందే అమెరికా ముందస్తుగా బుక్ చేసుకోవడం విశేషం.