Begin typing your search above and press return to search.
ట్రంప్ తీరుతో అమెరికాలో ఇప్పుడెలాంటి పరిస్థితి ఉందంటే?
By: Tupaki Desk | 31 July 2020 5:15 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పలుదేశాలు ఎవరికి తోచిన విధానాన్ని వారు పాటించారని చెప్పాలి. ఇలాంటి విపత్తు విషయంలో అమెరికా అనుసరించే తీరు ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తి వ్యక్తమైంది. మిగిలిన దేశాలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవటంపై విస్మయం వ్యక్తమైంది. కొందరైతే.. ఆయన అనుసరించిన విధానం బాగుందని.. చాలా దేశాలు ట్రంప్ తీరును ఫాలో కాకుండా తప్పు చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా.
కరోనా వేళలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అగ్రరాజ్యమైన అమెరికాలో ఎలాంటి దారుణ పరిస్థితుల్ని తీసుకొచ్చాయన్నది ఇప్పుడు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభ సమయంలోనూ అగ్రరాజ్యం ఇప్పుడు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని ఎదుర్కోవటం లేదని చెబుతున్నారు. కరోనా పుణ్యమా అని కొలువులు కోల్పోయిన అమెరికన్లు.. ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్న తీరు ట్రంప్ సర్కారుకు ఇబ్బందికరంగా మారుతోంది.
ఆర్థిక సంక్షోభ సమయంలో అమెరికా వ్యాప్తంగా ఏడు లక్షల మంది మాత్రమే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పక తప్పదు. గత వారం మొత్తంలో నిరుద్యోగ భృతికోసం దరఖాస్తు చేసుకున్న వారుఏకంగా 14 లక్షల మంది ఉండటం గమనార్హం. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రభావానికి లోనైంది. పలు పరిశ్రమలు.. సంస్థలు తమ ఉద్యోగులకు చెల్లుచీటి ఇచ్చేశాయి.
దీంతో.. ఉద్యోగాలు కోల్పోయిన వారు దారుణమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో.. వారు ప్రభుత్వం ఇచ్చే నిరోద్యోగ భృతి కోసం బారులు తీరుతున్నారు. వాస్తవానికి అమెరికాలో ఆర్థిక రంగం ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించని ట్రంప్ సర్కారు పుణ్యమా అని అమెరికా భారీ మూల్యాన్నిచెల్లించాల్సి వచ్చింది.
కరోనా సమయంలో అనుసరించాల్సిన భౌతిక దూరం.. మాస్కుల్ని పెట్టుకోవటం లాంటి విషయాల్లో అమెరికన్లు ప్రదర్శించిన మూర్ఖత్వం ఆ దేశాన్ని దారుణమైన స్థితిలోకి నెట్టిందని చెప్పకతప్పదు. కరోనా విషయంలో కఠినమైన ఆంక్షల్ని అమలు చేయని కారణంగా ఇప్పుడా దేశంలో పాజిటివ్ కేసులు గురువారం నాటికి 46 లక్షల్ని దాటేసింది.
వైరస్ బారిన పడి 1.54లక్షలకు పైగా అమెరికన్లు ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. రోజుకు దగ్గర దగ్గర ఎనభై వేల కేసులు కొత్తవి నమోదవుతుంటే.. పదిహేడు వందలకు పైగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా విషయంలో ట్రంప్ సర్కారు అనుసరించిన విధానానికి అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించిందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.