Begin typing your search above and press return to search.
కరోనాతో అమెరికా పరిస్థితి దారుణం: వైట్ హౌస్
By: Tupaki Desk | 4 Aug 2020 9:10 AM GMTకరోనా మన దేశాన్నే కాదు.. అగ్రరాజ్యం అమెరికాను అల్లాడిస్తోంది. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’. అమెరికాలో కరోనా వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పాడ్డాయని వైట్ హౌస్ ప్రకటించింది.
గత మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిర్క్స్ వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికాలో కరోనా నగరాలకే పరిమితం కాలేదని.. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని వైట్ హౌస్ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సమూహాలుగా ఏర్పడి చేసుకునే కార్యక్రమాలే సూపర్ స్ప్రైడర్ ఈవెంట్లుగా మారి కరోనాను వ్యాపింపచేస్తున్నాయని తెలిపారు.
నవంబర్, డిసెంబర్ వరకు శీతాకాలంలో కరోనా ఇంకా కోరలు చాచే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.