Begin typing your search above and press return to search.
కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగాం : ట్రంప్ !
By: Tupaki Desk | 11 Sep 2020 7:15 AM GMTకరోనా మహమ్మారి వ్యాప్తిని అమెరికా సమర్థవంతంగా కట్టడి చేయగలిగిందని అధినేత ట్రంప్ అన్నారు. యూరోపియన్ దేశాలతో పోలిస్తే అగ్రరాజ్యంలో 50 శాతం తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయని తెలిపారు. జూలై నాటికి కరోనా వైరస్ కేసులు 44 శాతం మేర తగ్గాయని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాంతక వైరస్ పై పోరాడుతున్న ప్రతీ ఒక్కరు తమకు గర్వకారణం అన్నారు. దేశవ్యాప్తంగా గతంలో కంటే కరోనా రికవరీ రేటు బాగా పెరిగిందని, దేశంలో మహమ్మారి సంక్షోభం తుది దశకు చేరుకుంది అని తెలిపారు. కరోనా వ్యాక్సిన్లు అందుబాటు లోకి రాకపోయినా చాలా మంది కరోనాను జయిస్తున్న తీరు సానుకూల పరిణామమని తెలిపారు.
కరోనా పరిస్థితులు, లాక్ డౌన్, స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభం, యూఏఈ- ఇజ్రాయెల్ చారిత్రక ఒప్పందం తదితర అంశాల గురించి గురువారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సురక్షిత వాతావరణం కల్పిస్తూ స్కూళ్లను తెరవాలను కుంటున్నాం. కరోనా వైరస్ చిన్నారులపై అంతగా ప్రభావం చూపదు. 28 ఏళ్ల కంటే తక్కువ వయస్సున వారిలో 0.2 శాతం కంటే తక్కువ కరోనా మరణాలు నమోదు అయ్యాయి. 20 కాలేజీల నుంచి ఇటీవల సేకరించిన డేటా ప్రకారం, ఒక్కరంటే ఒక్క విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. క్లాస్ రూం బోధనతో పోలిస్తే ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని, నేరుగా పాఠాలు చెప్పే ప్రక్రియను ఇది భర్తీ చేయలేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి అని ట్రంప్.
వచ్చే వారం శ్వేత సౌధంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరుగుతాయి అని ట్రంప్ వెల్లడించారు. అదే విధంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో దోహా, ఖతార్ కు పయనమవుతున్నారన్న ట్రంప్, అఫ్గనిస్తాన్ లో శాంతి స్థాపనకై సంబంధించిన చర్చలను ప్రారంభిస్తారని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి, సాహసోపేత నిర్ణయానికి ట్రంప్ పాలనా యంత్రాంగం కొన్నేళ్లుగా చేస్తున్న నిర్విరామ కృషే కారణమంటూ అధికారుల పై ప్రశంసలు కురిపించారు.