Begin typing your search above and press return to search.

మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు..అమెరికాలో ఒకేరోజు 2100 మంది మృతి

By:  Tupaki Desk   |   26 Nov 2020 6:45 AM GMT
మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు..అమెరికాలో ఒకేరోజు 2100 మంది మృతి
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని.. త్వరలోనే వ్యాక్సిన్​ వచ్చేస్తుందని అందరూ భావిస్తున్నవేళ కరోనా వైరస్​ అమెరికాను వణికిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో కరోనాతో 2100 మంది ప్రాణాలు కోల్పోయారు. త్వరలోనే వ్యాక్సిన్​ వస్తుందని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన ఫైజర్​ వ్యాక్సిన్​ సత్ఫలితాలు ఇచ్చింది.

డిసెంబర్​ నాటికి ఈ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని.. అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలు చూసి అమెరికా గజగజ వణికిపోతున్నది. మే తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 15 న అక్కడ ఒకే రోజులో 2600 ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లను మూసేశారు. క్రిస్మస్​, థ్యాంక్స్​ గివింగ్​ డే సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉన్నది. దీంతో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. మనదేశంలోనూ కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. నిపుణులు చెప్పినట్టే చలికాలంలో వైరస్​ మళ్లీ పంజా విసురుతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వైరస్​ సెకండ్​వేవ్​ ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా ఇప్పటికే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సెకండ్​వేవ్​ను తట్టుకొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.