Begin typing your search above and press return to search.
అగ్రరాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా .. మరణాల్లో అగ్రస్థానం !
By: Tupaki Desk | 14 Dec 2020 11:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గలేదు. కరోనా తో పోరాటం చేస్తూనే ప్రజలు తమ పనులని పూర్తి చేసుకుంటున్నారు. అయితే , కొందరు నిర్లక్ష్యం వహిస్తుండటం తో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికా లో మాత్రం కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అమెరికా లో కొత్తగా 1,79,174 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్క రోజే 1347 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు అమెరికాలో 1,67,28,550కి చేరగా, మరణాల సంఖ్య 3,06,429కి చేరింది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక , భారత్ లో కొత్తగా 30,254 కేసులు నమోదు కాగా, 391 మంది మరణించారు. ఇప్పటి వరకు భారత్ లో 98 లక్షలు దాటిపోయింది. ఇక మరణాలు 1,43,019కి చేరాయి. తాజాగా భారత్ లో కరోనా నుంచి 33,136 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 93,57,464కు చేరింది. ప్రస్తుతం 3,56,546 యాక్టివ్ కేసులున్నట్లు భారత ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా నిన్న కొత్తగా 5,26,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 7,523 మంది మరణించారు. ఇక మొత్తం కేసుల సంఖ్య7,26,18,391 చేరింది. ఇక మొత్తం మరణాలు 16,18,437 సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రికవరీ కేసులు 5,08,41,045 ఉండగా, యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,58,911కు చేరాయి. వాటిలో 1,06,130 కేసుల్లో కరోనా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.