Begin typing your search above and press return to search.
రోజులో అమెరికాలో నమోదైన కేసులు 2.9లక్షలు.. శ్మశానాలు ఫుల్
By: Tupaki Desk | 10 Jan 2021 4:10 AM GMTప్రపంచానికే పెద్దన్న. ఎవరెట్లా ఉన్నా.. తన ప్రయోజనం కోసం దేనికైనా సై అనేట్లుగా వ్యవహరించే అగ్రరాజ్యానికి కనిపించని శత్రువు చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మరే దేశంలో లేని రీతిలో అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజులో2.65 లక్షల కేసులు నమోదైతే.. దాదాపుగా నాలుగు వేల మంది మరణించారు.ఇక.. శుక్రవారం గడిచేసరికి దాదాపు 2.9లక్షల కేసులు కొత్తవి నమోదు కావటం కలకలం రేపుతోంది.
అదే సమయంలో.. 3676 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. అమెరికాలో ఇప్పటివరకు 2.18కోట్ల మందికి పాజిటివ్ కేసులు నమోదైతే.. 3.68 లక్షల మంది ఒక్క కరోనా కారణంగా మరణించారు. ఇదంతా చూస్తే.. కరోనా చేసిన డ్యామేజ్ ఎంత భారీ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతున్నా.. పాజిటివ్ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వైనం చూస్తే..అమెరికాను కరోనా ఏం చేస్తుందన్న సందేహం కలుగుక మానదు.
ఇప్పటివరకు 6.6 మిలియన్ల మందికి తొలి ఇంజెక్షను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న కేసులు ఆ దేశాన్నిఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు రోజువారీగా పెరిగిపోతున్న మరణాలతో.. శ్మశానాలు ఫుల్ అయిపోతున్నాయి. శ్మశాన వాటికల్లో స్థలం లభించని పరిస్థితి. కరోనాతో ఆసుపత్రులు రద్దీగా మారగా.. వైద్య సేవలు అందించటం మహా ఇబ్బందిగా మారినట్లుగా తెలుస్తోంది. ప్రపంచానికి అగ్రరాజ్యమైన అమెరికా.. కంటికి కనిపించని శత్రువుతో ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పక తప్పదు.