Begin typing your search above and press return to search.

మాస్కుల వల్ల స్వేచ్ఛను కోల్పోతున్నారట...అమెరికన్ల వింత వాదన, వీడియో వైరల్ !

By:  Tupaki Desk   |   8 March 2021 2:30 PM GMT
మాస్కుల వల్ల  స్వేచ్ఛను కోల్పోతున్నారట...అమెరికన్ల వింత వాదన, వీడియో వైరల్ !
X
కరోనా మహమ్మారి చైనా లో వెలుగులోకి వచ్చినా కూడా అమెరికాలో ఎక్కువగా ప్రభావం చూపించింది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక కరోనా కేసులు వెలుగులోకి వచ్చింది కూడా అమెరికాలోనే .. ఒకే రోజే అత్యధిక కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయిన రికార్డ్ కూడా అమెరికా పైనే ఉంది. అలాగే ఎంతోమంది అమెరికన్లు కరోనా మహమ్మారి భారిన పడి మరణించారు. కాగా.. ఇప్పుడిప్పుడే అమెరికా కరోనా బారి నుంచి కొంచెం కొంచెం బయటపడుతోంది. రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అమెరికన్లు.. మాస్కులు ధరించడం ద్వారా తాము స్వేచ్ఛను కోల్పోయామంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

అలాగే , మొండికేస్తూ కరోనా భారిన పడకుండా ఉండేందుకు ముఖ్యమని మనం భావించే మాస్కులను సైతం తగలబెడుతున్నారు. అలాగే , తమ పిల్లలనూ దానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఇడాహో రాష్ట్ర రాజధానిలో వందలాది మంది మాస్క్, కరోనా వ్యాక్సిన్ వ్యతిరేకవాదులు తాజాగా భారీ ర్యాలీ చేపట్టారు. మాస్క్‌ ధరించడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాస్క్‌లు ధరించడ ద్వారా తాము స్వేచ్ఛను కోల్పోయినట్టు వ్యాక్యానించారు. అంతటితో ఆగకుండా మాస్కులను ఓ డబ్బాలో వేసి, తగలబెట్టారు. మాస్కులకు నిప్పంటించాలంటూ తమ పిల్లలను కూడా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 29 మిలియన్ల మంది కొవిడ్ బారినపడగా.. 5లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.