Begin typing your search above and press return to search.
నిబంధనలు సడలించడం కొంపముంచింది... యూఎస్‌లో పెరుగుతున్న కేసులు..!
By: Tupaki Desk | 17 March 2021 3:30 AM GMTచైనాలోని వూహాన్లో మొదలైన కరోనా.. ఆదేశంలో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఇతర దేశాలను గజగజ లాడించింది. ముఖ్యంగా కరోనాతో ఎక్కువగా నష్టపోయింది మాత్రం అమెరికా అని చెప్పకతప్పదు. ప్రాణ నష్టం ఆ దేశంలోనే ఎక్కువగా జరిగింది. అయితే కరోనాకు వ్యాక్సిన్ రావడంతో అమెరికా ప్రజలు, అక్కడి ప్రభుత్వం సైతం మహమ్మారిని లైట్ తీసుకున్నాయి. దాదాపు యూఎస్‌లోని 12 రాష్ట్రాలు లాక్డౌన్ రూల్స్‌ను సడలించాయి. ప్రజలు కూడా ఇక కరోనా పోయిందని భావించి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. అదే వాళ్ల కొంపముంచింది. ప్రస్తుతం అమెరికాలో మళ్లీ కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. అమెరికాలో అనేక రకాల కొత్త వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయని అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా వేగంగా విస్తరిస్తున్నదని అక్కడి వైద్యులు అంటున్నారు.
వేసవి ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా బీచ్‌లకు నదీతీరాలకు వెళ్తున్నారు. ఇదో ఎంతో ప్రమాదమని ఇలా వెళ్లడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. గత ఆదివారం అమెరికా ప్రభుత్వం విమానాశ్రయాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. మరోవైపు బీచ్‌లకు, పబ్బులకు వెళ్లే ప్రజలు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం మాస్కులు ధరించడం లేదు. అంతేకాక భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రన మాస్కులు తీసేయడం సరైన నిర్ణయం కాదని వాళ్లు హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా చాలా రోజుల తర్వాత శరీరంలో యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి. అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లోనూ కొత్త తరహా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కొత్త వేరియంట్ కేసులు నమోదైనప్పటికీ వాటి సంఖ్య పరిమితంగానే ఉంది.