Begin typing your search above and press return to search.

మహమ్మారిపై జగన్ సర్కారు భారీ సమరం ప్రకటించిందిగా!

By:  Tupaki Desk   |   23 Jun 2020 4:45 AM GMT
మహమ్మారిపై జగన్ సర్కారు భారీ సమరం ప్రకటించిందిగా!
X
విపత్తు ఏదైనా వచ్చినప్పుడే పాలకుల సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది. తియ్యటి మాటలు చెప్పేసి.. ఆ క్షణానికి ప్రజల్ని మైమరిచిపోయేలా చేయటం చాలామంది చేస్తారు. మాటల కంటే చేతల్లో చూపించేటోళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాయదారి రోగంపై సమరశంఖం పూరించిన ఏపీ సర్కారు.. అందుకు భారీ వార్ ప్లాన్ ను సిద్ధం చేసింది.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్ష చేయాలని డిసైడ్ చేయటమ కాదు.. అందుకు తొంభై రోజుల టైం బౌండ్ పెట్టుకున్న తీరు చూస్తే.. ఈ మహమ్మారి ఇప్పట్లో చెక్ పెట్టే అవకాశం లేదని చెప్పక తప్పదు. మరి.. రాష్ట్రం మొత్తం పరీక్షలు జరిపించటం అంటే మాటలు కాదు కదా? అందుకు భారీ ప్లాన్ కావాలన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ పనిని పూర్తి చేసింది జగన్ సర్కారు.

ప్రతి మండలానికి ఒక 104 వాహనాన్ని కేటాయిస్తారు. నమూనాలు సేకరించే ఏర్పాట్లు అందులో ఉంటాయి. 104 సిబ్బందితో పాటు ఏఎన్ఎం.. ఆశా కార్యకర్తలు.. వాలంటీర్లు ఉంటారు. వీరంతా ఇంటింటికి తిరగటమే కాదు.. మనుషులకు.. పశువులకు.. ఎవరికైనా పరీక్షలు జరిపి అక్కడిక్కడే మందులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని డిసైడ్ చేశారు. అంతేకాదు.. మహమ్మారి నిర్దారణ పరీక్షల్ని చేయించనున్నారు. ఎందుకిలా అంటే.. రానున్నరోజుల్లో ఈ జబ్బు బారిన పడి మరణాలు ఎక్కువగా నమోదు కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో రోజుకు 24వేల పరీక్షలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల ఆరోగ్య కార్డుల్లో ఇప్పటికి 1.20 కోట్ల కార్డుల పంపిణీ పూర్తి అయ్యింది. జులై ఒకటి నాటికి 104.. 108 వాహనాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇలా వైరస్ వ్యాప్తి మరింత వ్యాపించకుండా ఉండటంతో పాటు.. మరణాలు నమోదు తక్కువగా ఉండేలా జగన్ సర్కారు ప్లాన్ సిద్ధం చేసిందని చెప్పాలి. మహమ్మారికి చెక్ పెట్టే విషయంలో దూసుకెళుతున్న ఏపీ సర్కారును చూసైనా తెలంగాణ సర్కారు నేర్చుకుంటుందా? అన్నది ప్రశ్నగా మారింది.