Begin typing your search above and press return to search.
ఏపీలో చేయిస్తే పాజిటివ్.. హైదరాబాద్ లో చేయిస్తే నెగిటివ్ వచ్చిందా?
By: Tupaki Desk | 25 Jun 2020 8:30 AM GMTఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఒక టీడీపీ ఎమ్మెల్సీకి మహమ్మారి నిర్ధారణ పరీక్ష చేయిస్తే.. వచ్చిన ఫలితం అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఇప్పుడీ ఉదంతం ఏపీ విపక్షంలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో చేస్తున్న కరోనా పరీక్షల మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా ఈ పరిణామం ఉండటం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలుసు కదా? ఆయనకు ఈ మధ్యన పరీక్ష చేశారు.
తీరా ఫలితం చూస్తే పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ తేలిన వారిని వెంటనే క్వారంటైన్ కు తీసుకెళ్లటం తెలిసిందే. తెలంగాణలో అయితే.. తక్కువ రోగ లక్షణాలు ఉంటే నేరుగా ఇంటికి పంపించేయటం తెలిసిందే. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఆసుపత్రిలోనో.. క్వారంటైన్ సెంటర్లలోనూ చికిత్స చేయిస్తున్నారు. దీంతో.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని కూడా క్వారంటైన్ సెంటర్ కు రావాలన్నారు.
అయితే.. పరీక్ష ఫలితాలు వచ్చేసరికి దీపక్ రెడ్డి హైదరాబాద్ లో ఉండటంతో.. ఆయన అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నారు. అనూహ్యంగా తెలంగాణలో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష చేయించుకున్నారు. అప్పుడు కూడా నెగిటివ్ రావటంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కొత్త ఆరోపణలను తెర మీదకు తీసుకొచ్చింది. ఒక విపక్ష ఎమ్మెల్సీకి ఏపీలో పరీక్ష చేస్తే పాజిటివ్ రావటం ఏమిటి? తెలంగాణలో చేయిస్తే నెగిటివ్ రావటం ఏమిటి? దీని వెనకున్న రాజకీయం ఏమిటన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
ఒక ఎమ్మెల్సీకి చేసిన పరీక్ష ఫలితమే ఇలా ఉంటే.. రోజువారీగా చేస్తున్నట్లు చెబుతున్న వేలాది పరీక్షలు సరిగా చేస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేత లోకేశ్. ముఖ్యమంత్రి జగన్ పారాసిల్మాల్ మాటలు చెప్పినట్లే యంత్రాంగం కూడా ఆషామాషీగా వ్యవహరిస్తుందా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయాన్ని పక్కన పెడితే.. ఒక ప్రజాప్రతినిధికి చేసిన పరీక్షలు రెండు రాష్ట్రాల్లో వేర్వురు ఫలితాలు రావటం మాత్రం సరికాదని చెప్పక తప్పదు.