Begin typing your search above and press return to search.

పెళ్లి చూపుల్లో మహమ్మారి కలకలం..ఒకరు మృతి!

By:  Tupaki Desk   |   2 July 2020 11:30 PM GMT
పెళ్లి చూపుల్లో మహమ్మారి కలకలం..ఒకరు మృతి!
X
భారత్‌ లో వైరస్ అలజడి రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల ద్వారా వైరస్ సంక్రమిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చూపులకు వెళ్లిన ఫ్యామిలీ పై వైరస్ పంజా విసిరింది. డ్రైవర్‌ నుంచి అందరికీ సోకి.. చివరకు ఓ వృద్ధుడు చని పోయాడు. మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం యర్రంశెట్టి వారిపాలెం గ్రామానికి చెందిన యువకుడి కి ఉప్పల గుప్తం మండలం ఎస్‌.యానాకుం చెందిన యువతితో నిశ్చితార్థమైంది. అయితే, కొన్ని రోజుల క్రితం యువతి బంధువులు యువకుడి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. పెళ్లి కూతురు తాత, తల్లీదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ కలిసి కారులో వెళ్లారు. ఆ కారును ఓ 108 అంబులెన్స్‌ డ్రైవర్ నడిపారు.

పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చడంతో.. అమ్మాయిని చూసేందుకు రావాలని వారిని ఆహ్వానించారు. ఆ తర్వాత జూన్ 19న యువకుడి కుటుంబ సభ్యులు కూడా ఎస్.యానాం గ్రామానికి వెళ్లారు. అమ్మాయి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అమ్మాయి తరపు వారు ప్రయాణించిన కారును నడిపిన డ్రైవర్‌ కు మహమ్మారి పాజిటివ్ వచ్చింది. దీనితో అమ్మాయి కుటుంబ సభ్యులకు వైరస్ పరీక్షలు నిర్వహించగా పెళ్లి కుమార్తె తాత, తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మకు కూడా వైరస్ సోకింది. ఇక చికిత్స పొందుతూ ఆదివారం పెళ్లి కుమార్తె తాత మరణించాడు. దీనితో అబ్బాయి తరపు వారు కూడా అప్రమత్తమయ్యారు. వారు ప్రస్తుతం హోం క్వారంటైన్‌ లో ఉన్నారు.