Begin typing your search above and press return to search.
కర్నూల్ లో ఘోరం : కరోనా భయంతో ఆత్మహత్య ..టెస్టుల్లో నెగటివ్!
By: Tupaki Desk | 10 July 2020 9:50 AM GMTఓ వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ, కరోనా నిర్దారణ టెస్టులో ఫలితం మాత్రం కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ లో చోటు చేసుకుంది. కర్నూలు పాతబస్తీ కేవీఆర్ గార్డెన్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ స్వర్ణకార వృత్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో గత కొద్దీ రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే అతడు రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా, కరోనా పరీక్షా చేయించుకోమని డాక్టర్లు సూచించారు.
డాక్టర్ సలహా మేరకు ఓ ప్రైవేటు ల్యాబ్ లో కరోనా పరీక్షలు చేయించుకొని రిపోర్టుల కోసం వేచి ఉన్నాడు. ఇంతలోనే ఏమైందో కుటుంబసభ్యులు ఆస్పత్రి దగ్గర ఉండగా స్నానం చేసి వస్తానంటూ ఇంటికి వెళ్లి , కరోనా సోకిందేమో అన్న భయంతో ఇంట్లోనే ఉరి వేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే అతనికి కరోనా టెస్టులో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంభాన్నీ ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఈ ఘటనతో అక్కడ విషాదచాయలు అలముకున్నాయి.