Begin typing your search above and press return to search.
ఒకే ఇంట్లో 22 మందికి పాజిటివ్ ..ఎక్కడంటే ?
By: Tupaki Desk | 11 July 2020 5:45 AM GMTఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలను దాటిపోయింది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వైరస్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 2,200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే , తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో ఒకే కుటుంబంలో 22 కేసులు తేలడం కలకలంరేపింది. కాంటాక్ట్ లపై ఆరా తీస్తే ఒకరి వల్ల మిగిలిన 21మందికి వైరస్ సోకినట్లు తెలిసింది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ఓ 84 ఏళ్ల వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో వెళ్లారు. అయితే ఆ పెద్దాయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు నగరిలో ఉంటున్నారు. వారం క్రితం ఆయన భార్య చనిపోయారు. అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చారు. మూడు రోజుల క్రితం ఆయన కుమారుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లారు. ఆ కుటుంబసభ్యులు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆ ఫ్యామిలీలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో ఆరుమందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే , అదే వీధిలో ఉంటున్న ఒక వైద్యుడితో పాటు ఆయన ఇంట్లో ఉన్న ఐదుగురికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది.