Begin typing your search above and press return to search.
గందరగోళం: ప్రైవేట్ లో నెగటివ్ . ప్రభుత్వ ఆస్పత్రిలో పాజిటివ్
By: Tupaki Desk | 15 July 2020 10:15 AM GMTవైరస్ నిర్ధారణ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రైవేటు ల్యాబ్ లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇష్టారీతిన పరీక్షలు నిర్వహించి వారికి తోచిన విధంగా ఫలితం ఇస్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వారంతా ప్రభుత్వ ల్యాబ్ ల్లో చేసుకుంటే పాజిటివ్ తేలుతోంది. దీంతో ప్రైవేట్ ల్యాబ్ ల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఏపీలో ఇదే జరిగింది. ప్రైవేట్ లో టెస్ట్ చేస్తే నెగిటివ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేసుకుంటే పాజిటివ్ తేలింది. దీంతో బాధితులతో పాటు అధికారులు అవాక్కవుతున్నారు.
- ఓ గర్భిణి తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైరస్ నిర్ధారణ టెస్ట్ చేయించుకొస్తేనే అడ్మిట్ చేసుకుంటామని వైద్యులు చెప్పడంతో ఈ నెల 3వ తేదీన రుయాకు వెళ్లి స్వాబ్ ఇచ్చారు. అక్కడ ఆలస్యమవుతుండడంతో 7వ తేదీన తిరుపతిలోని ప్రైవేటు ల్యాబ్‌కి వెళ్లి వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చింది. అయితే తర్వాత రుయా రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలింది.
- ఇటీవల మరణించిన వీడియో జర్నలిస్ట్ సారథి జ్వరం రావడంతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్ టెస్ట్ చేసుకోమని సూచించగా సారథి ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయించారు. అక్కడ నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వైరస్ లేదని సాధారణ జ్వరమేనని చికిత్స చేసుకుని నిర్లక్ష్యంగా ఉండిపోయారు. నాలుగు రోజుల తరువాత ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడంతో అనుమానం వచ్చి స్విమ్స్‌కు వెళ్లారు. అప్పటికే చేయి దాటిపోయే పరిస్థితి. స్విమ్స్‌లో చేరిన మరుసటి రోజే మృతిచెందారు. అతడికి పాజిటివ్ అని తేలింది. ఈ విధంగా ప్రైవేటు ల్యాబ్ లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.