Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా జోరు...రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు!
By: Tupaki Desk | 17 July 2020 9:50 AM GMTఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. తాజాగా శుక్రవారం ఏపీ సర్కార్ విడుదల చేసిన బులిటెన్ లో రాష్ట్రంలోనే తొలిసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 2,592 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిల్స్ పరీక్షించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 8మందికి.. విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో తాజాగా నమోదు అయినా మొత్తం కేసుల సంఖ్య 2,602కు చేరాయి. వీటితో కలిపి ఇప్పటివరకు .. రాష్ట్రంలో 40,646 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
అలాగే, గడచిన 24 గంటల్లో 42మంది కరోనా భారిన పడి చనిపోయారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 534కి చేరింది. అలాగే ,గత 24 గంటల్లో 943మంది కోలుకోవడంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 20,298కి చేరింది. ప్రస్తుతం 19,814మంది హాస్పిటల్ లో కరోనా కి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 643 - గుంటూరు జిల్లాలో 367 - చిత్తూరు జిల్లాలో 328 - కర్నూలు జిల్లాలో 315 - అనంతపురం జిల్లాలో 297 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 5151పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.